అనంతపురం: ఏపీకి కేంద్రం ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ అనంతపురంలో టీడీపీ ధర్మపోరాట దీక్ష నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిగా వచ్చి.. మోడీ ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియో ప్రదర్శన చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు.. మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అప్పట్లో బీజేపీతో చేయి కలపాల్సివచ్చిందన్నారు. విభజన హామీల అమలు కోసం నాలుగేళ్ల పాటు వేచి చూశాం..రోజులు గడుస్తున్నా మోడీ సర్కార్.. రాష్ట్రానికి ఏమాత్రం సాయం అందించలేదు..ఇక ఉపేక్షిస్తే లాభం లేదనే ఉద్దేశంతోనే ఎన్టీయే నుంచి బయటికి వచ్చామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు లేవనెత్తిన ప్రధాన అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం
* ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మాయ మాటలు చెప్పారు
* విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అడిగితే ఇప్పటి వరకు స్పందించలేదు
* ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీ రాజధాని నిర్మిస్తామని చెప్పి.. మట్టి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
* రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తామన్న కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించలేదు
* భూములిచ్చించేందకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఇంకా విద్యా సంస్థలను నిర్మించలేదు
* మెట్రో రైలు ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మన రాష్ట్రానికి మొండి చేయి చూపించారు
* విశాఖ, విజయవాడుకు మెట్రో ఎందుకు ఇవ్వరు
* ఎన్నిసార్లు కోరినా ఇప్పటి వరకు విమానాశ్రయ విస్తరణకు అనుమతులు ఇవ్వలేదు
* ఏపీ,తెలంగాణ రాష్ట్రాల సమస్యలను పరిష్కరించలేదు
ఉన్నామో చచ్చామో చూడటానికి మోడీ వస్తున్నారా ?
ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర సమస్యలపై స్పందించపోవడం ఎన్డీయే నుంచి బయటకి వచ్చామని చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీ సర్కార్ పై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కేంద్ర పెద్దలు మన వాళ్లను బెదిరిస్తున్నారు. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడితే ఐటీ అధికారులతో దాడులు నిర్వహిస్తున్నారు. ఇంత అన్యాయం చేసిన ప్రధాని మోడీ.. మన రాష్ట్రానికి వస్తున్నారు...ఎందుకు మనం ఉన్నామో.. చచ్చామో చూడటానికా అంటూచంద్రబాబు ఉద్వేగంగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ మన మీద పెత్తనం మాత్రమే కోరుకుంటున్నారు..మేం బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు
బీజేపీ కోసమే వైసీపీ ఎంపీల రాజీనామా
ధర్మపోరాట దీక్ష వేదికగా చంద్రబాబు వైపీపీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం దేశంలోని పార్టీలు ముందుకు వస్తుంటే..వైసీసీ మాత్రం తప్పించుకుంటోంది..ఆ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని వదిలి పెట్టి..ప్రజలకు కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న తమపై ఎదురు దాడి చేయడం సిగ్గు చేటు అని చంద్రబాబు ఆరోపించారు. కుట్రలో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. అవిశ్వాసం సమయంలో మోడీ సర్కార్ కు వైసీపీ పరోక్షంగా మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఇదంత ప్రధాని మోడీ మెప్పుకోసమే వైసీపీ ఇలా నాటకాలు ఆడుతోందని చంద్రబాబు దయ్యబట్టారు.
కేసీఆర్ తో వైసీపీ కుమ్మకైందని ఆరోపణ
ఇక్కడ కేసీఆర్ విజయం అంశాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ సంబంరాలు చేసుకోవడం సిగ్గుచేటు. కేసీఆర్ కు ఇక్కడి ప్రతిపక్షాల సహకరిస్తున్నాయి. కొందరు కులమత రాజకీయాలకు పాల్పడుతున్నారు..కులం మతం పేరుతో ఎవ్వరు సీఎం, పీఎం కాలేరు అభివృద్ది చేస్తేనే ప్రజలు పట్టం కడతారనే విషయం నేతలు తెలుసుకోవాలని మోడీ, జగన్ లకు చంద్రబాబు పరోక్షంగా చురకలు అంటించారు