వైఎస్ జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

వైఎస్ జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

Updated: Oct 10, 2019, 05:33 PM IST
వైఎస్ జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎంవో కార్యాలయం సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ను ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ను చిరంజీవి, రామ్ చరణ్ కలవనున్నారు. తాను నటించిన హిస్టారికల్ బ్లాక్ బస్టర్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'ని వీక్షించేందుకు రావాల్సిందిగా చిరంజీవి వెళ్లి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఇద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి కావడంతో అటు రాజకీయ వర్గాల్లో ఇటు అభిమానుల్లో వీళ్ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్‌ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది.

గత శనివారం తెలంగాణ రాజ్ భవన్‌కి వెళ్లిన చిరంజీవి.. అక్కడ గవర్నర్ డా తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి 'సైరా' సినిమాను వీక్షించేంజుకు రావాల్సిందిగా ఆహ్వానించడం... చిరు ఆహ్వానాన్ని మన్నిస్తూ నిన్న బుధవారం తమిళిసై తన కుటుంబసభ్యులతో కలిసి సైరా సినిమా వీక్షించిన సంగతి తెలిసిందే.