CM Jagan Mohan Reddy: రూ.10 వేల సాయంపై సీఎం జగన్ కీలక ప్రకటన.. సచివాలయంలో అర్హుల జాబితా

CM Jagan Visits Flood Affected Areas: వరద బాధితులకు సాయం అందివ్వాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వాళ్లు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరికీ సాయం చేశారని చెప్పారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 7, 2023, 01:34 PM IST
CM Jagan Mohan Reddy: రూ.10 వేల సాయంపై సీఎం జగన్ కీలక ప్రకటన.. సచివాలయంలో అర్హుల జాబితా

CM Jagan Visits Flood Affected Areas: అల్లూరి జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వారం రోజుల కిందట గోదావరి నది పొంగి వరద వచ్చిన పరిస్థితుల్లో దాదాపు 16 లక్షల క్యూసెక్కుల పరివాహంతో నీళ్లు వచ్చాయన్నారు. మన ప్రాంతాలకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలి నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించి కలెక్టర్‌కు వరద వచ్చినప్పుడే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అధికారులకు కావాల్సిన వనరులు ఇచ్చి వారం రోజుల పాటు సహాయ కార్యక్రమాలకు ఏ మాత్రం అలసత్వం లేకుండా చేయాలని చెప్పామన్నారు. కలెక్టర్లకు సదుపాయాలు ఇచ్చి.. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల నుంచి యాక్టివేట్‌ చేశామని తెలిపారు.

"ఈసారి వరద వచ్చినప్పటికీ అప్పటికప్పుడు నేను వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోవడం కాకుండా కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి, సరైన సమయం ఇచ్చి, అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వారం రోజుల్లో వాళ్లంతా ప్రతి గ్రామంలోకి వెళ్లి ఏ ఒక్క ఇంటినీ మిగిలిపోకుండా ప్రతి ఒక్కరికీ సహాయం అందించే కార్యక్రమం చేశారు. ఇంతకు ముందూ ఇదే చేశాం. ఇప్పుడూ చేస్తున్నాం. సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్‌ వ్యవస్థ దాకా యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరూ సాయం అందకుండా ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చాం. ఇళ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో ఏ కుటుంబానికైనా ఆ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడమే కాకుండా రూ.2 వేలు ఇవ్వకపోయి ఉంటే తప్పే. అలా జరగకపోతే ఎవరైనా నాకు చెప్పవచ్చు. 

ఇళ్లలోకి నీళ్లు రాకపోయినా మన గ్రామాలు కటాఫ్‌ అయిపోయి ఉంటే.. ఆ ఇళ్లకు రేషన్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, పాలు, కూరగాయలు ఇటువంటివన్నీ 5 రకాలు కలిపి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఆదేశించాం. అటువంటివి ఎవరికైనా దక్కకపోయి ఉంటే ఇక్కడ చెప్పొచ్చు. దానికి ప్రభుత్వం జవాబుదారీ తనం తీసుకుంటుంది. కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియలీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దు. 

పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఎన్యుమరేషన్‌ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పే. ప్రతి అడుగులోనూ, గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాలు పెడుతున్నాం. అందరికీ మేలు జరగాలని పెట్టాం..  ఇంకా ఎవరికైనా సాయం అందకపోతే నాకే చెప్పండి" అని సీఎం జగన్ తెలిపారు. తాను అధికారులను నిలదీయడానికి రాలేదని.. అధికారులకు శభాష్‌ అని చెప్పి.. వెన్ను తట్టి బాగా చేశారని చెప్పడం కోసం వచ్చానని చెప్పారు. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే అందరూ ఇక్కడే ఉన్నారని అన్నారు. 

Also Read: Delhi AIIMS Fire Accident: ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులో మంటలు  

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి లైన్ క్లియర్.. పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News