CM Jagan Review on Floods: గోదావరి పరివాహన ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని..రేపటికి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సీఎం జగన్. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని..కంట్రోల్ రూమ్‌లు సైతం అప్రమత్తంగా పనిచేయాలన్నారు. సహాయ శిబిరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు తక్షణ సహాయం ఇవ్వాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పారు. అత్యవసరం మందుల పంపిణీ జరగాలని దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలపై నిఘా అవసరమన్నారు.
బలహీనంగా ఉన్న చెరువులు, ఇరిగేషన్ కాల్వలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్లపై అప్రమత్తంగా ఉండాలని..వరద నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల తక్షణ నిధులు కేటాయించారు. వరద నష్టాన్ని అంచనా వేసి..తనకు అందించాలన్నారు సీఎం.
Also read:Rain Alert: మరింత బలపడిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..!
Also read:Srilanka Crisis: లంక విడిచి వెళ్లేందుకు రాజపక్సే యత్నం.. విమానాశ్రయంలో పట్టుకున్న ప్రజలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook