వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం.. వారి ఖాతాల్లోకి రూ.18,750

అక్కాచెల్లెమ్మల ముఖాల్లో వెలుగు నింపడానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan launches YSR Cheyutha Scheme) ప్రారంభించారు.

Last Updated : Aug 12, 2020, 12:21 PM IST

    వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం

  • తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు
  • 23 లక్షల మంది ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ
వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం.. వారి ఖాతాల్లోకి రూ.18,750

అమరావతి: అక్కాచెల్లెమ్మల ముఖాల్లో వెలుగు నింపడానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ (YSR Cheyutha) పథకాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా నిర్ధేశించుకుని రూపొందించిన ఈ పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా బుధవారం (YS Jagan launches YSR Cheyutha Scheme) ప్రారంభించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 23 లక్షల మంది ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ అవుతుంది. Sputnik V‌: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు!

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున జమ చేస్తారు. నాలుగేళ్లలో ఒక్కో అక్కాచెల్లెమ్మకు మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందనుంది. వైఎస్సార్ చేయూత (YSR Cheyutha Scheme)లో భాగంగా మొదటి విడత సాయంగా  బుధవారం సీఎం వైఎస్ జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 
RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు

అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి అతిపెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకం నిమిత్తం ఏపీ బడ్జెట్‌లో రూ.4,700కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో రూ.17 వేల కోట్లు లబ్ధిపొందనున్నారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి 
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే 

Trending News