AP: ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 

Last Updated : Nov 2, 2020, 06:03 PM IST
  • ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
  • విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సూచన
  • పాలిటెక్నిక్‌‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలన్న సీఎం
AP: ఉన్నత విద్యపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

ఏపీలో ఉన్నత విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో క్లాసుల నిర్వహణ, తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. కరోనా కష్ట సమయంలోనూ 5 లక్షల ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినట్లు  తెలిపారు. కోవిడ్19, లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు. 

Photos: Karwa Chauth Mehndi Designs 2020: కర్వా చౌత్ మెహెందీ స్పెషల్ డిజైన్లు చూశారా..

 

ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింత మందికి ఆన్‌లైన్ క్లాసులు అందుబాటులోకి తీసుకురాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలని అధికారులతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీలలో ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని , వాటికి నూతన లైసెన్స్ ఇవ్వడంతో పాటు పాత వాటిని రెగ్యులేషన్ చేయడంపై జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read : Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో నలుగురు స్మగ్లర్లు సజీవ దహనం

 

50 శాతం సీట్లు కాలేజ్‌ కోటా కింద, మరో 50 శాతం సీట్లు కన్వినర్‌ కోటా కింద కేటాయించేలా చూసుకోవాలని నిర్ణయించారు. పేద విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయిస్తామని, ప్రభుత్వమే ఫీజు రియింబర్స్‌మెంట్‌ కింద ఫీజులు చెల్లిస్తుందని.. విద్యకు ఏ ఆటకం కలగదన్నారు. ట్రైబల్‌ యూనివర్శిటీపై దృష్టి సారించాలని సూచించారు.

Photos : Bigg Boss Telugu 4 Funny Memes: కడుపుబ్బా నవ్వించే బిగ్ బాస్ తెలుగు 4 ఫన్నీ మీమ్స్, ట్రోల్స్!

 

ప్రైవేటు యూనివర్శిటీలకు ఆయా కోర్సుల ప్రకారం ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ (న్యాక్‌) గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పాలిటెక్నిక్‌‌లో కొత్త కోర్సులను తీసుకురావాలని, ఉద్యోగాల కల్పనా కేంద్రాలుగా పాలిటెక్నిక్‌ కాలేజీలను తీర్చిదిద్దాలని సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News