AP COVID-19 updates: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు

COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజూ 20 వేలకు పైగా కరోనా కేసులు సర్వసాధారణమయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 22,018 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2021, 02:38 AM IST
AP COVID-19 updates: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు

COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజూ 20 వేలకు పైగా కరోనా కేసులు సర్వసాధారణమయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 22,018 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌ తాజాగా ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 13,88,803 మందికి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 96 మంది చనిపోయారని, తాజాగా మృతి చెందిన వారి సంఖ్యతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 9,173కు చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2,03,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 19,177 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. అలా ఇప్పటివరకు 11 లక్షల 72 వేల 948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

Also read : Telangana COVID-19 updates: తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు.. 29 మంది మృతి

ఇదిలావుంటే, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్‌ సెకండ్ డోస్‌ (COVID-19 vaccine second jab) ఇచ్చే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మొదటి డోస్ తీసుకున్న పౌరులు రెండో డోస్ తీసుకోవాల్సిందిగా అనిల్ సింఘాల్ సూచించారు.

Also read : Raghurama Krishnam Raju అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన Nara Lokesh

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News