Telangana COVID-19 updates: తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు.. 29 మంది మృతి

COVID-19 cases in Telangana: హైద‌రాబాద్: తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 57,416 కరోనా పరీక్షలు చేయ‌గా 4,305 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌ శాఖ‌ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేట‌ర్ హైదరాబాద్ (GHMC) ప‌రిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2021, 02:33 AM IST
Telangana COVID-19 updates: తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు.. 29 మంది మృతి

COVID-19 cases in Telangana: హైద‌రాబాద్: తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుదలకు బ్రేకులు పడటం లేదు. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 57,416 కరోనా పరీక్షలు చేయ‌గా 4,305 మందికి కరోనా సోకినట్టు గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌ శాఖ‌ వెల్లడించింది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేట‌ర్ హైదరాబాద్ (GHMC) ప‌రిధిలోనే అత్యధికంగా 607 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో జిల్లాల వారీగా నమోదైన కేసుల సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి-293, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-291, న‌ల్ల‌గొండ‌-246, క‌రీంన‌గ‌ర్‌-229, ఖ‌మ్మం-222, సిద్దిపేట‌-169, వికారాబాద్‌-158, నాగ‌ర్‌క‌ర్నూలు-143, మంచిర్యాల‌-139, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-137, పెద్ద‌ప‌ల్లి-134, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-130, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-128, జ‌గిత్యాల‌-125, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-122, సంగారెడ్డి-111, వ‌న‌ప‌ర్తి-110 జిల్లాల్లో కనీసం వందకుపైగానే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మ‌హ‌బూబాబాద్‌-94, నిజామాబాద్‌-82, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-76, యాదాద్రి భువ‌న‌గిరి-75, సిరిసిల్ల‌-71, గ‌ద్వాల్‌-71, జ‌న‌గామ‌-63, ములుగు-51, మెద‌క్‌-47, కామారెడ్డి-36, ఆదిలాబాద్‌-34, సూర్యాపేట‌-31, కొమురంభీం ఆసిఫాబాద్‌-29, నారాయ‌ణ‌పేట‌-26, నిర్మ‌ల్‌-25 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also read : AP COVID-19 updates: ఏపీలో కొత్తగా 22,018 కరోనా కేసులు

కొత్తగా గుర్తించిన కేసులతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో గుర్తించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ 5,20,709 కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 2,896కి పెరిగింది. శుక్ర‌వారం 6,361 మంది కరోనా వైర‌స్ (Coronavirus) నుంచి కోలుకున్న‌ట్లు పేర్కొన్న ఆరోగ్య‌శాఖ‌.. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో మొత్తం 54,832 యాక్టీవ్ కేసులు ఉన్నాయ‌ని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే, మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్కెట్లు, బస్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్ లాంటి రద్దీ ప్రదేశాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్ నిబంధనలు (Lockdown) ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.

Also read : AP Ambulances: తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే, రాజ్యాంగ ఉల్లంఘన అంటూ వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News