Covishield vaccine: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. ఇవాళ ఏపీకు వ్యాక్సిన్ చేరుకోనుంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రక్రియకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలింది. అత్యవసర అనుమతి పొందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield vaccine ) దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు చేరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ చేరుకోనుంది. మద్యాహ్నానికి విజయవాడ విమానాశ్రయానికి 4.7 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. కాస్సేపటి క్రితం హైదరాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ వాటా వ్యాక్సిన్ చేరుకుంది.
పూణే నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానంలో వ్యాక్సిన్ సరఫరా ( Vacine distribution ) హైదరాాబాద్, విజయవాడ, భువనేశ్వర్ నగరాలకు వ్యాక్సిన్ చేరుకోనుంది. వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకున్న తరువాత అంటే జనవరి 13న అన్ని జిల్లా కేంద్రాల స్టోరేజ్ పాయింట్లకు తరలించనున్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండేలా వ్యాక్సిన్ డెలివరీ వాహనాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నవరంలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి శీతలీకరణ కేంద్రంలో 60 క్యూబిక్ మీటర్ల సామర్ధ్యమున్న రెండు పెద్ద వాక్‌ఇన్ కూలర్స్ సిద్ధంగా ఉన్నాయి.
వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రం ( Vaccine storage centre ) వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి వ్యక్తులకు ప్రవేశం నిషిద్ధం చేశారు. సీసీ కెమేరాలతో పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. తొలిదశలో 3 లక్షల 87 వేలమందికి వ్యాక్సిన్ అందించనున్నారు.
Also read: AP: గెలిచిన ప్రభుత్వ వాదన..ఎన్నికల షెడ్యూల్ రద్దు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook