AP Rains Alert: మొన్నటి వరకూ భారీ వర్షాలతో కుదేలైన ఏపీకు మరోసారి వర్షాలు వెంటాడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా మూడ్రోజులపాటు మోస్తరు లేదా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 72 గంటల్లో ఏపీ వాతావరణం ఇలా ఉండనుంది
ఉత్తర బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం బంగ్లాదేశ్‌లోని కేపుపార తీరానికి 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగా తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృకతమై ఉంది. ఈ వాయుగుండం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ మరింతగా బలపడనుంది. అందుకే ఇప్పుడు రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా ఏపీలోని కోస్తాంధ్రలో మోస్తరు లేదా భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది.
వాయుగుండం ప్రభావంతో ఏపీలో రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే ఏపీ కోస్తాతీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మరోవైపు మత్స్యకారుల్ని వేటకు వెళ్లవద్దని కూడా సూచనలు జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంతంలోని ప్రజల్ని అలర్ట్ చేశారు.
Also read: Chandrababu Naidu: రాష్ట్రాన్ని సీఎం జగన్ భ్రష్టు పట్టించారు: చంద్రబాబు నాయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook