Supreme Court: ఎన్నికలకు ముందు ఏపీ సర్కారుకు భారీ షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలివే..

Inner Ring Road Case: ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీగా షాక్ ఎదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దుకు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Jan 29, 2024, 01:20 PM IST
  • 2022లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court: ఎన్నికలకు ముందు ఏపీ సర్కారుకు భారీ షాక్.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలివే..

AP Ysrcp Government: ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న కొలది రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ లు అధికార వైఎస్సార్సీపీని గట్టిగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మరోవైపు షర్మీల ఆరోపణలు జగన్ సర్కారుకు మరింత తలనొప్పిగా మారాయి. ఇదిలా ఉండగా.. 2022లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసింది.  

ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.  ఈ కేసులో కూడా 17ఏ నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించిన ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయంతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ ఎలాంటి సంబంధం ఉందా? అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ 17ఏ వర్తిస్తే..  తదుపరి ఏం చేస్తారని ప్రభుత్వాన్నిసుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Read Also: Rohini Acharya: ''చెత్త, చెత్తకుప్పలోకే వెళ్తుంది".. వైరల్ గా మారిన లాలూ కూతురు చేసిన పోస్ట్..

ఈ కేసుకు ఐపీసీలోని పలు సెక్షన్లు వర్తిస్తాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ   సెక్షన్ 420 ను ఊటంకిస్తూ.. ఈ  సెక్షన్ ఎలా వర్తిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.

చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలను సుప్రీకోర్టు ధర్మాసనం  తన ముందుకు తెప్పించుకుని విచారణ చేపట్టింది. అదే విధంగా దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News