Dharmana Prasad Rao: ధర్మాన అస్త్రసన్యాసం.. కొడుకు జనసేనలోకి!

Srikakulam Politics: సిక్కోలులో ఆ మాజీమంత్రి సైలెంట్‌ ఎందుకు అయ్యారు.  కొద్దిరోజులుగా వైఎస్‌ జగన్‌తో ఎందుకు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచే వైదొలిందుకే ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారా..! కొడుకు కోసం రాజకీయాలకు గుడ్‌ బై చెబుతారా..! ఇంతకీ ఆయన మనసులో ఏముంది..! ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి ఏమీ ఆలోచిస్తున్నారు..!

Written by - G Shekhar | Last Updated : Nov 29, 2024, 05:21 PM IST
Dharmana Prasad Rao: ధర్మాన అస్త్రసన్యాసం.. కొడుకు జనసేనలోకి!

Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు ధర్మాన ప్రసాదరావు. మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన.. కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన మాజీమంత్రి.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు..  ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఆర్నెళ్లు గడిచినా ఆయన మౌనవ్రతం వీడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక అనుచరులు, కార్యకర్తలు తెగ పరేషాన్‌ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం మభగాం గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ధర్మాన. ఆ తర్వాత ఐదు సార్లు ఎమ్మెల్యే గా నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం సంపాదించారు. సిక్కోలు రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు పొందిన ధర్మాన ప్రసాదరావు.. వైసీపీ ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించారు. కానీ వైసీపీ సర్కార్‌ ఓటమి తర్వాత ప్రసాదరావు ప్రజల్లోకి రావడం మానేశారు. స్వయానా అన్న అయిన మరో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఇటీవలి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి ఇంటికి వెళ్లి ఆహ్వానించిన ధర్మాన ప్రసాదరావు ముఖం చాటేశారు. అంతేకాదు పార్టీలో సీనియర్‌ నేతలుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి సీనియర్లు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం పరిస్థితుల్లో ధర్మాన ప్రసాద రావు వైసీపీలో కొనసాగుతారా..! లేదంటే రాజకీయ నుంచి వైదొలుగుతారా అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయినట్టు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో పదవులన్నీ అనుభవించి ఇప్పుడు సైలెంట్ కావడం ఏంటనే సొంత పార్టీ నేతల్లో చర్చ సైతం జరుగుతోందట. అయితే ధర్మాన సైలెంట్ వెనుక బలమైన కారణమే ఉందని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ధర్మాన కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడుకి పొలిటికల్‌ రూట్‌ క్లియర్‌ చేసేందుకు ధర్మాన సైలెంట్‌ ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. మనోహర్‌ నాయుడిని జనసేన పార్టీలోకి పంపేందుకు ధర్మాన మౌనంగా ఉంటున్నారని టాక్‌. మనో హర్‌ నాయుడు త్వరలోనే జనసేన పార్టీలోనూ చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్‌ వైఎస్‌ జగన్‌కు వీర వీదేయుడు.. కొద్దిరోజులుగా అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇది కూడా ధర్మాన ప్రసాదరావు సైలెంట్‌గా ఉండటానికి మరో కారణంగా చెబుతున్నారు..

మొత్తంగా ఈ ప్రశ్నలన్నీంటికీ సమాదానం చెప్పాల్సిన ధర్మాన మాత్రం మౌనవ్రతం మాత్రం వీడటం లేదు. దాంతో ఆయన వైఖరి ఏంటో తెలియక అనుచరులు, కార్యకర్తలు పరేషాన్‌ అవుతున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గానికి సమన్వయ కర్త లేక దాదాపు ఆరు నెలలు అవుతోంది. దాంతో పార్టీని పట్టించుకునే నేతనే లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన స్పందించాలని అనుచరులు కోరుతున్నారు. చూడాలి మరి ధర్మాన నేతల వినతిని వింటారా.. లేదంటే.. తనదారి తనదే అన్నట్టు వ్యవహరిస్తారా అనేది త్వరలోనే తేలనుంది..

Also Read: CONGRESS PARTY: మా అడ్డాలో మీ పెత్తనమా.. కామారెడ్డి ఎమ్మెల్యేలు రివర్స్‌!

Also Read: Deeksha Diwas: కేసీఆర్ హిమాలయమైతే.. రేవంత్‌ రెడ్డి ఆయన కాలిగోటికి సరిపోడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News