ఆన్‌లైన్‌లో డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

ఆన్‌లైన్‌లో డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

Last Updated : Sep 22, 2019, 01:15 AM IST
ఆన్‌లైన్‌లో డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

అమరావతి: ఏపీ డీఎస్సీ–2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారమే విడుదల చేసింది. మొదటి ప్రోవిజినల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకారం ఉద్యోగ అర్హత సాధించిన అభ్యర్థుల వివరాల జాబితాను https://schooledu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి ప్రకటించారు. ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సంధ్యా రాణి తెలిపారు. 

సెప్టెంబర్‌ 23న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను, సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని అన్నారు.

Trending News