రైతన్నకు తీపి కబురు.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Last Updated : Jun 23, 2019, 05:43 PM IST
రైతన్నకు తీపి కబురు.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. రుతుపవనాల రాకతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాగల 24 గంటల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. రాజస్థాన్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు చత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతోనే తెలంగాణ, కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, కరువుసీమ రాయలసీమలో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 

ఇదిలావుంటే, ఈసారి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయని రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ ఏడాదికి సాగుకు అవసరమైన విధంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Trending News