ఆ ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన సూర్య

ఎప్పుడూ బిజీగా ఉండే హీరో సూర్య ..ఆ ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేశాడట. ఇంతకీ ఏంటా ఛాన్స్ .. విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

Last Updated : May 29, 2019, 02:03 PM IST
ఆ ఛాన్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసిన సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య తో మూవీ తీయాడానికి దర్శక నిర్మాతలు క్యూకడుతుంటారు. ఎప్పుడూ తీరని లేని షెడ్యూల్ తో బిబీ బిజీగా గడుపుతారాయన.  అయితే దిగ్గజ  దర్శకుడు శ్రీరాఘవ తో సినిమా చేయడం కోసం 18 ఏళ్లుగా వెయిట్ చేశాడట సూర్య. ఈ విషయాన్ని సూర్య స్వయంగా ప్రకటించాడు. ఎట్టకేలకు ఎన్జీకే (నంద గోపాల కృష్ణ)తో ఆ కోరిక తీరిందంటున్నాడు సూర్య.  మంగళవారం  జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో సూర్య ఈ వ్యాఖ్యలు చేసి అందర్ని ఆశ్చపరిచాడు. 

సూర్య మాట్లల్లో చెప్పాలంటే  “నా జీవితంలో శ్రీరాఘవగారు స్పెషల్‌ పర్సన్‌. 18 ఏళ్లు ఆయనతో పని చేయాలని వెయిట్‌ చేశాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ వారి వ్యక్తిగత వ్యవహారాలను పక్కన పెట్టి వర్క్‌ చేశారు. శ్రీరాఘవగారు, యువన్‌ మ్యాజికల్‌ కాంబోలో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. ఓ సాధారణ వ్యక్తి రాజకీయ శక్తిగా మారి సమాజానికి ఎలా ఉపయోగపడ్డాడనేదే ఈ సినిమా” పేర్కొన్నారు.

ఈ మూవీ గురించి సూర్య మాట్లాడుతూ తన కెరీర్ లో ఎన్జీకే సినిమాను వెరీ వెరీ స్పెషల్ మూవీగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం తన కెరీర్ లో ఏడాదిన్నర గ్యాప్ వచ్చిందంటున్నాడు. కాగా హీరో సూర్య సరసన రకుల్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన NGK మూవీ ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా మే 31న థియేటర్లలోకి వస్తోంది.
 

Trending News