వైఎస్సార్ కాంగ్రెస్ వలలో చిక్కుకోవద్దని చంద్రబాబుకి చెప్పాను: నరేంద్ర మోదీ

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాను ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటానని తెలిపారు. 

Last Updated : Jul 21, 2018, 05:01 PM IST
వైఎస్సార్ కాంగ్రెస్ వలలో చిక్కుకోవద్దని చంద్రబాబుకి చెప్పాను: నరేంద్ర మోదీ

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాను ఆంధ్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటానని తెలిపారు. తమ ప్రభుత్వం ఆర్థిక సంఘం రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి..  2016లో చంద్రబాబుకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి తాము సిద్ధమేనని ఆయన అన్నారు. ఆంధ్ర ప్రజల అభ్యున్నతికి తాను ఎప్పటికీ పాటుపడుతూనే ఉంటానని మోదీ ఈ సందర్భంగా తెలిపారు.

ఎన్డీఏ నుండి తెలుగు దేశం వైదొలుగుతున్నప్పుడు.. చంద్రబాబుకి వైఎస్సార్ కాంగ్రెస్ వలలో పడవద్దని చెప్పానని కూడా మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనను కాంగ్రెస్ ఏ రాజకీయ లబ్ది కోసం చేసిందో తనకు తెలుసని.. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ విషయంలో తొలుత ఇదే విషయంలో గొడవలు జరిగినా.. ప్రస్తుతకాలంలో టీఆర్‌ఎస్ కాస్త పరిణితితో ప్రవర్తించడం నేర్చుకుందని మోదీ అభిప్రాయపడ్డారు.

అటల్ బీహారీ వాజ్‌పేయి హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు (ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్) ఏర్పడి అభ్యున్నతి దిశగా వెళ్తున్నాయని.. కానీ కాంగ్రెస్ విభజించిన ఆంధ్రప్రదేశ్ వల్లే సమస్యలు అని మోదీ తెలిపారు. అయితే మోదీ ప్రసంగం పూర్తి అయ్యాక.. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ స్పందించారు. నరేంద్ర మోదీ చెప్పిన విషయాలు ఏవీ కూడా తనకు అంత సంతృప్తి ఇవ్వలేదని.. ఆయన డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. ఈ మాటలకు బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆంధ్ర ప్రజలు పూర్తిగా మోసానికి గురై నష్టపోయారని.. దీనికి బాధ్యత ఎవరు వ్యవహరిస్తారని కేశినేని అన్నారు. ఇదే క్రమంలో ఆయన మోదీని పదే పదే డ్రామా ఆర్టిస్టు అని సంబోధించడంతో బీజేపీ నేతలు మండిపడ్డారు. 

Trending News