Heavy Rains in Ap: ఓ వైపు నైరుతి రుతు పవనాలు మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే గత రెండ్రోజుల్నించి విస్తారం వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మొన్నటి వరకూ సరైన వర్షాలు లేకున్నా జూన్ చివర్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 99.4 మిల్లీమీటర్లు కాగా 162 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో అత్యధికంగా వర్షం కురిసింది.
వర్షాలు పడేటప్పుడు ఉరుములు పిడుగులు పడే అవకాశమున్నందున రైతులు, కూలీలు పొలాల్లో, చెట్ల కింద ఉండవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ కూడా జారీ చేసింది. రానున్న 4 రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉంటాయో ఐఎండీ వివరించింది.
జూలై 2న అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక జూలై 3న పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, శ్రీకాకుళం చిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.
జూలై 4వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్ష సూచనతో పాటు పిడుగులు పడే ప్రమాదముంది. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
జూలై 5వ తేదీన కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook