Cyclone Alert: ప్రస్తుతం భూమిపై సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో మరో రెండ్రోజుల్లో తుపాను ఏర్పడవచ్చనే హెచ్చరిక జారీ అయింది. ఫలితంగా మరి కొద్దిరోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు తప్పవవి తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఈ ఏడాది అంటే 2023 తొలి తుపాను ఏర్పడనుంది. మే 6వవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం 7వ తేదీనాటికి అల్పపీడనంగా, 8 నాటికి వాయుగుండంగా ఆ తరువాత తుపానుగా మారనుంది. వాయువ్య బంగాళాఖాతంలో తుపానుగా మారిన తరువాత మరింత బలపడవచ్చని సమాచారం. ఈ తుపాను కోస్తాంధ్రను తాకవచ్చని అంచనా ఉంది. గత ఏడాది మే నెలలో ఏర్పడిన తుపానులు కూడా ఏపీ తీరంవైపుకే దూసుకొచ్చాయి. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మరి కొద్దిరోజులు భారీ వర్షాలు తప్పవని తెలుస్తోంది. అదే సమయంలో మే నెలలో వడగాల్పులు, తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. ఇవాళ, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులగా భారీ వర్షాలు నమోదయ్యాయి.
విశాఖ, అనకాపల్లి, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో నిన్న బుధవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో 95.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ప్రతి యేటా మే నెలలో తుపానులు ఏర్పడటం సహజమే. 2022 మే మొదటివారంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాలు నాలుగురోజులు ముందుగానే దేశంలో ప్రవేశించాయి. 2021 మే నెల రెండవ వారంలో ఏర్పడిన టౌక్టే తుపాను సైతం ఆ సమయంలో ముందుస్త రుతుపవనాలకు ఏర్పడింది. ఇక అదే ఏడాది మే 23వవ తేదీ బంగాళాఖాతంలో యాస్ తుపాను ఏర్పడింది. త్వరలో ఏర్పడనున్న తుపాను ప్రభావం గట్టిగానే ఉండవచ్చని అంచనా.
Also read: Janasena About YS Jagan: సీఎం గాల్లో ప్రయాణిస్తుంటే... హైవే మీద వాహనాలు ఆపుతారా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook