Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ట ఇప్పటికే వర్షాలు పడుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు మూడ్రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నా.యి.
బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఇది దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు రేపు అంటే జూలై 24న పశ్చి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఫలితంగా రాష్ట్రంలో వచ్చే 2-3 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చు.
అటు దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్షాటక, మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు పడవచ్చు. ఇక ఏపీలోని కోస్తాంధ్రలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. కొంకణ్, గోవా, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. గుజరాత్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికితోడు వచ్చే రెండు మూడ్రోజులు రాజస్తాన్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Heavy Rains: ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook