Chirri Balaraju: ఆఫీసులో ఉద్యోగి పాడుపని... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జనసేన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

Janasena Mla Chirri balaraju: పోలవరం జనసేన ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఐటీడీఏ కార్యాలయంకు వెళ్లారు. అప్పుడు ఒక ఉద్యోగి పబ్జీ గేమ్ ఆడుకుంటూ కన్పించాడు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 29, 2024, 09:22 PM IST
  • ఉద్యోగికి బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే ..
  • ఆఫీసు టైమ్ లో ఇదేంపనంటూ వార్నింగ్..
Chirri  Balaraju: ఆఫీసులో ఉద్యోగి పాడుపని... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జనసేన ఎమ్మెల్యే.. వీడియో వైరల్..

ITDA Government employee playing pubg game in office timing: చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. ప్రజలకు మంచి చేయాల్సిన స్థానంలో ఉండి,  లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ తమ విధులు సరిగ్గా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కొందరు ఇష్టమున్నట్లు టైమింగ్ లకు వస్తుంటారు. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో వారికే తెలియదు.  మరికొందరైతే.. ఆఫీసుకు టైమ్ పాస్ చేయడానికి మాత్రమే వస్తుంటారు. తాపీగా ఆఫీసుకు వస్తుంటారు. చేసే పనుల కోసం లంచాలు తీసుకుంటూ ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తుంటారు.

 

తమ పనుల కోసం వచ్చిన వారిని వేధిస్తుంటారు. కొందరు ఆఫీసులకు వచ్చి, సంతకం పెట్టేసి రోజంతా తమ పనులు చేసుకుంటారు. మరికొందరు ఆఫీసుల్లో పడుకోవడం, రీల్స్ చేసుకొవడం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఒక సర్కారుఉద్యోగి డ్యూటీ సమయంలో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. ఇతగాడిని జనసేన రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..

పోలవరానికి  చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రిబాలరాజు కేఆర్ పురంలోని ఐటీడీఏ  ఆఫీసుకు వెళ్లారు. ఆయన ముఖానికి మాస్క్ పెట్టుకుని సాధారణ వ్యక్తిలాగా ఆఫీసుకు తనిఖీ చేయడానికి వెళ్లారు. అప్పుడు ఒక అధికారి సీటులో కూర్చుని, ఆఫీసు సమయంలో పబ్జీ ఆడుకుంటూ గడిపేస్తున్నారు. ఎమ్మెల్యే చిర్రిబాలరాజు అతని వెనకాలే ఉండిచాలాసేపు అతని వాలకాన్ని గమనించాడు.కానీ సదరు ఉద్యోగి మాత్రం పబ్జీ ఆటలో మునిగిపోయాడు. ఈ ఘటనను ఎమ్మెల్యే చిర్రిబాలరాజు అనుచరులు వీడియో తీశారు. ఆ తర్వాత అతడిని ఉన్నతాధికారుల దగ్గరకు తీసుకెళ్లారు.

Read more: Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..

ఆఫీసు సమయంలో ఇదేం ఆటలు అంటూ మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాల్సిన స్థానంలో ఉండి, ఆఫీసు సమయంలో పబ్జీ గేమ్ ఆడటమేంటని నిలదీశారు. వెంటనే సదరు ఉద్యోగి సాయికుమార్ పై శాఖాపరమైన చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News