MP Sanjeev Kumar Resigns to YSRCP: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా వైసీపీకి కర్నూల్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఊహించని షాకిచ్చారు. వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తాను ఇచ్చిన హామీలు నెరవేరాయా..? లేదా..? అని 45రోజులుగా ఆలోచించకున్నానని చెప్పారు. చివరికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మెడికల్, ఎన్‌హెచ్, రైల్వే పరంగా చాలా వరకు ప్రగతి సాధించానని.. పథకాలు బాగున్నా నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
లోక్‌సభకు సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తానని చెప్పారు కర్నూల్ ఎంపీ. కర్నూలు నుంచి 2.59 లక్షల మంది ప్రతి ఏడాది వలసలు ఉంటాయని.. తుంగభద్ర ఉన్నా నీరు లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు లేవన్నారు. తాము ఎన్నికైన తర్వాత అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారని చెప్పారని.. అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటే ఇక తన పాత్ర ఏమిటి..? అని ప్రశ్నించారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్నది కేవలం జనరల్ స్టేట్‌మెంట్ అని.. పదవి ఇచ్చినా అధికారం ఇవ్వలేదన్నారు.
వారికి దగ్గరగా ఉన్న వారికి పనులు జరుగుతున్నాయి. పది శాతం అభివృద్ధి చేయలేకపోయాను. మాకు ఒక పంట పండించడం గొప్ప. కర్నూల్ నుంచి బళ్ళారి జాతీయ రహదారి ఫైల్ గడ్కరీ వరకు తీసుకుని వెళ్లాను. తర్వాత దాని గురించి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. కర్నూల్ మెడికల్ కాలేజీకి ఏడు సూపర్ స్పెషాలిటీ సీట్లు తీసుకొచ్చా. ఐదేళ్ల కాలంలో జగన్‌ను వ్యక్తిగతంగా రెండుసార్లు కలిశా.. నా ఫోన్లకు, సందేశాలకు సమాధానం లేదు. విజయసాయి రెడ్డితో మాట్లాడాను. అపాయిట్‌మెంట్ ఇస్తానని చెప్పినా.. మళ్లీ స్పందించలేదు.." అని ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు.
కాగా.. కర్నూల్ పార్లమెంట్ బాధ్యతల నుంచి ఎంపీ సంజీవ్ కుమార్‌ను తప్పించే అవకాశం ఉండడంతో రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాం పేరును ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ఫైల్ చేసింది. గత రెండు ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గుమ్మనూరు. ఈసారి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook