Rains Live Updates: వరుణుడి ప్రతాపానికి అల్లకల్లోలం.. రెండు రాష్ట్రాల్లో ఇది పరిస్థితి..!

AP Telangana Rains Live Updates: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టింది. రెయిన్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 1, 2024, 12:54 PM IST
Rains Live Updates: వరుణుడి ప్రతాపానికి అల్లకల్లోలం.. రెండు రాష్ట్రాల్లో ఇది పరిస్థితి..!
Live Blog

AP Telangana Rains Live Updates: తెలుగు రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భార నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహబూబాబాద్‌ అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోవడంతో విజయవాడ- కాజీపేట మార్గంలో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 
 

1 September, 2024

  • 12:53 PM

    Heavy Rail Alert in Andhra Pradesh: అమరావతి: తాడేపల్లిలోని వాతావరణ శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన  హోం మంత్రి వంగలపూడి అనిత 

    - వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష  నిర్వహిస్తున్నాం: హోం మంత్రి 

    - వర్షాల పట్ల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : హోం మంత్రి అనిత

    - ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని తెలుసుకుంటున్నాం: హోం మంత్రి 

    - అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు: హోం మంత్రి అనిత

  • 12:44 PM

  • 10:46 AM

    Heavy Rain Alert in AP and Telangana: విజయవాడ: ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక.

    ==> ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,82,360 క్యూసెక్కులు
    ==> ప్రకాశం బ్యారేజీ దగ్గర 15.2 అడుగులకు చేరిన నీటిమట్టం
    ==> దివిసీమకు పొంచి ఉన్న వరద ముప్పు
    ==> నదీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

  • 10:38 AM

    AP Rain Fall Details: ఏపీలో వర్షపాతం వివరాలు (సెం.మీ.లలో)

     
    అమరావతి (గుంటూరు జిల్లా) 26, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా) 26, గుంటూరు (గుంటూరు జిల్లా) 23, కుకునూర్ (జిల్లా ఏలూరు) 20, అచ్చంపేట (పల్నాడు జిల్లా) 19, తెనాలి (జిల్లా, గుంటూరు) 18 (గుంటూరు జిల్లా) 17, నందిగామ (ఎన్టీఆర్ జిల్లా) 17, పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) 17, మాచర్ల (పల్నాడు జిల్లా) 17, వేలైర్లపాడు (జిల్లా ఏలూరు) 16, నూజివీడు (ఏలూరు జిల్లా) 14, ముండ్లమూరు (ప్రకాశం జిల్లా, కూనవరం) 14 (జిల్లా అల్లూరి సీతారామరాజు) 14, జంగమహేశ్వరపురం (జిల్లా పల్నాడు) 13, బాపట్ల (బాపట్ల జిల్లా) 13, విజయవాడ (ఆర్గ్) (జిల్లా ఎన్‌టిఆర్ జిల్లా) 13, సంతమాగులూరు (బాపట్ల జిల్లా) 12, వరరామచంద్రాపూర్ (జిల్లా) (జిల్లా అల్లూరి సీతారామరాజు, 12వ జిల్లా) కృష్ణా) 11, అద్దంకి (బాపట్ల జిల్లా) 11. 

    విజయవాడ ఎ.పి. (జిల్లా ఎన్టీఆర్ జిల్లా) 11, చింతూరు (జిల్లా అల్లూరి సీతారామరాజు) 11, కారంచేడు (జిల్లా బాపట్ల) 10, కైకలూరు (జిల్లా ఏలూరు) 9, సత్తెనపల్లె (పల్నాడు జిల్లా) 9, రేపల్లె (బాపట్ల జిల్లా) 9, అనకాపల్లి (జిల్లా, అనకాపల్లి) ఎలమంచిలి (జిల్లా అనకాపల్లి) 8, మార్కాపూర్ (ప్రకాశం జిల్లా) 8, చీమకుర్తి (ప్రకాశం జిల్లా) 8, పొదిలి (జిల్లా ప్రకాశం) 7, ఒంగోలు (ప్రకాశం జిల్లా) 7, గుడివాడ (జిల్లా) 7, యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా) 6 (ప్రకాశం జిల్లా) 6, కంబం (ప్రకాశం జిల్లా) 6, మర్రిపూడి (ప్రకాశం జిల్లా) 6.
     
    పార్వతీపురం (పార్వతీపురం జిల్లా) 6, బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా) 6, బొబ్బిలి (విజయనగరం జిల్లా) 5, ఏలూరు (జిల్లా ఏలూరు) 5, సీడీఆర్ (కృష్ణా జిల్లా) 5, భీమడోలు (జిల్లా ఏలూరు) 5, కొయ్యలగూడెం (జిల్లా ఏలూరు) 5, దర్శి (ప్రకాశం జిల్లా) 5, రాచర్ల (ప్రకాశం జిల్లా) 5, చింతలపూడి (జిల్లా ఏలూరు) 5, బొండపల్లె (విజయనగరం జిల్లా) 5, సీతానగరం (పార్వతీపురం జిల్లా) 4, అర్ధవీడు (ప్రకాశం జిల్లా) 4, సాలూరు (పార్వతీపురం జిల్లా) 4, అనకాపల్లి (ఎ) (జిల్లా అనకాపల్లి) 4, గంట్యాడ (విజయనగరం జిల్లా) 4, శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) 4, పార్వతీపురం జిల్లా మన్యం) 4, నర్సీపట్నం (జిల్లా అనకాపల్లి) 3, వెలిగండ్ల (ప్రకాశం జిల్లా).

  • 10:34 AM

    Heavy Rain Alert in AP and Telangana: హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన. 

    ==> తీవ్ర ఇబ్బందులకు గురైన ఏడు మండలాల ప్రజలు.

    ==> 24 గంటలుగా కుండ పోత మేళ్లచెరువు మండలంలో చెరువు కట్ట తెగి నీట మునిగిన సుమారు 200 ఎకరాల పంట పొలాలు. 

    ==> పొంగిపొర్లుతున్న చెరువులు కుంటలు రహదారుల పై ఉధృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు. 

    ==> హుజూర్నగర్ లో 299.8mm 
    ==> మఠంపల్లి లో 160.9mm
    ==> నేరేడుచర్ల లో 110.mm 
    ==> గరిడేపల్లి లో 103.0mm
    ==> పాలకవీడు లో 
    ==> 70.0mm
    ==> మేళ్లచెరువులో 155.00mm
    ==> చింతలపాలెంలో 60.mm గా వర్షపాతం నమోదు.

  • 10:31 AM

    Heavy Rain Alert in AP and Telangana: మంగళగిరి టౌన్:

    ==> రత్నాల చెరువు ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటన.

    ==> భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారా లోకేష్.

    ==> ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంతం. పలు ఇళ్లలోకి చేరిన నీరు.

    ==> బాధితులతో మాట్లాడిన నారా లోకేష్.

    ==> ప్రభుత్వం తరపున అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి లోకేష్‌కి వివరించిన అధికారులు
     

  • 10:24 AM

    AP Telangana Rains Latest News: బెజవాడలో రికార్డ్‌ వర్షం..

    ==> 30 ఏళ్ల రికార్డ్ బద్దలు.. 

    ==> చరిత్రలో ఎన్నడూ లేనంతగా బెజవాడలో ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు.. 

    ==> రెండు రోజులు విజయవాడలో కుండపోత.. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నిలిచిన నీరు.. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు నిలిచిన నీరు.

  • 10:22 AM

    AP Telangana Rains Latest News: భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మల్లెమడుగు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై నీరు చేరింది. అటు కృష్ణా జిల్లా కొండపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం బోనకల్లు చింతకాని, రైల్వే స్టేషన్లో ఎక్కడికక్కడే రైళ్లు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. మంచినీళ్లు, ఆహారం దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్స్ ఎప్పుడు బయలుదేరితే తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు .

  • 10:11 AM

    AP Telangana Rains Latest News: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నందిగామ మండలం అప్పారెడ్డి గూడ వాగు, ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు, చౌద్దరిగూడ గొల్లకేరి వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. 

  • 10:08 AM

    AP Telangana Rains Latest News: పల్నాడు జిల్లా: రామాపురం రెడ్ ఎలర్ట్

    ==> దాచేపల్లి మండలం రామాపురం క్రిష్ణా నదిలో ని పూర్తిగా మునిగిన చేపల కాలనీ

    ==> మత్స్య కారుల కాలనీలోకి భారీగా వరద నీరు

    ==> సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలింపు

    ==> అర్ధరాత్రి వరద నీరు ఎక్కువగా రావడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

Trending News