ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు ఇంకా పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం(Low Pressure) ఏర్పడనుంది. కొమరిన్, శ్రీలంక తీరప్రాంతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూలు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితి ఈ నెల 29వ తేదీవరకూ కొనసాగనుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం..రానున్న 48 గంటల్లో బలపడి..పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఫలితంగా రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని ఐఎండీ(IMD)తెలిపింది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల..ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains)పడవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తీరం వెంబడి 30-4- కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో విలవిల్లాడిన రాయలసీమ జిల్లాలలు పొంచి ఉన్న భారీ వర్షాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Also read: Tirupati: తిరుపతి వాసులకు కొత్త కష్టాలు-ఇళ్లకు బీటలు,భయాందోళనలో స్థానికులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook