Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందా

Helicopter Crash: మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండగా మరోవైపు చంద్రబాబు లక్ష్యంగా కుట్ర జరిగి ఉండవచ్చనే సందేహాలు సంచలనం రేపుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2024, 01:58 PM IST
Helicopter Crash: ఆ హెలీకాప్టర్ చంద్రబాబు కోసమా, కుప్పకూలడంతో ప్రమాదం తప్పిందా

Helicopter Crash: ముంబై నుంచి హైదరాబాద్ వచ్చే క్రమంలో కుప్పకూలిన హెలీకాప్టర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకొచ్చిందని తేలడంతో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారా, అందుకే అధికారులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా ఓ హెలీకాప్టర్ కుప్పకూలింది. అతి తక్కువ ఎత్తులోనే అది పూణే సమీపంలో కూలి పూర్తిగా ధ్వంసమైంది.  అయిత ఈ హెలీకాప్టర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తీసుకున్న హెలీకాప్టర్ అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ హెలీకాప్టర్‌ను ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడి నుంచి విజయవాడకు తీసుకురావల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ పూణే సమీపంలో కుప్పకూలింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ వాడిన హెలీకాప్టర్ 1000 గంటల ప్రయాణం పూర్తవడంతో సర్వీసింగ్ నిమిత్తం ముంబై పంపించారు. అప్పటి వరకు స్టాండ్ బై కోసం ఈ హెలీకాప్టర్ సిద్ధం చేసి పంపించారు. 

అయితే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అందులోనూ జెడ్ కేటగరీ భద్రత ఉన్న వ్యక్తికి 16 ఏళ్ల నాటి పాత హెలీకాప్టర్ స్టాండ్ బై కింద పంపించడం అనుమానాలకు తావిస్తోంది. గ్లోబల్ వెకాట్ర అనే సంస్థ నుంచి 2008 మోడల్ హెలీకాప్టర్‌ను ఏవియేషన్ అధికారులు తీసుకుని పంపించారు. వాస్తవానికి 10 ఏళ్లు దాటిన హెలీకాప్టర్ అద్దెకు తీసుకోకూడదనే నిబంధన ఉంది. కానీ ఏవియేషన్ అధికారులు ఈ నిబంధనల్ని పట్టించుకోలేదు. 16 ఏళ్ల నాటి కాలం చెల్లిన హెలీకాప్టర్ స్టాండ్ బై కోసం అద్దెకు తీసుకున్నారు. ఇది కాలం చెల్లింది కావడం వల్లనే తక్కువ ఎత్తు నుంచి పడినా మొత్తం ధ్వంసమైపోయింది. 

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి హెలీకాప్టర్ ఎంపిక విషయంలో అధికారులు ఇంత అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుుతున్నాయి. కొంతమంది అయితే చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హెలీకాప్టర్ ఎంపిక వెనుక కుట్ర కోణం ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే అధికారులు ఇంత అజాగ్రత్తగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

ఎందుకంటే హెలీకాప్టర్ ముంబై నుంచి తీసుకొచ్చే సమయంలో కుప్పకూలకుండా వినియోగించే క్రమంలో ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

Also read: Vitamin B12 Deficiency: విటమిన్ బి12 లోపం నిర్లక్ష్యం చేస్తే శరీరం మొత్తం గుల్లే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News