గుంటూరు: గుంటూరు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన మాజీ స్పీకర్ నాందెండ్ల మనోహర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా విషయం ఆయన స్వయంగా ధ్రువీకరించినట్లు ప్రముఖలో మీడియాలో కథనం వెలువడింది. కాగా ఈ రోజు సాయత్రం మనోహర్ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లనున్నట్లు తెలిసింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ సైతం రాత్రికి తిరుమలకు చేరుకోనున్నట్లు టాక్ ..మీడియా కథనం ప్రకారం రేపు ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించనున్నారు. మనోహర్ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని జనసేన భావిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టారు. 2004, 2009లో గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. విభజన నిర్ణయం కారణం చేత 2014లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈ వ్యవధిలో నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవులు అలంకరించారు. ప్రభుత్వంలోని పలు హోదాల్లో, అసెంబ్లీ కమిటీల్లో పనిచేశారు . వైఎస్ హయంలో కొంత కాలం డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించిన నాదెండ్ల...2011లో స్పీకర్‌గా ప్రమోట్ అయ్యారు. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోవడంతో కొన్నాళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.. చివరకు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుచరులతో సూచనల మేరకు నాదెండ్ల జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని టాక్.