ముందస్తు ఎన్నికలు: కేసీఆర్‌పై నారా లోకేష్ కామెంట్స్

కేసీఆర్ లక్ష్యంగా నారా లోకేష్ కామెంట్స్

Updated: Sep 7, 2018, 02:29 PM IST
ముందస్తు ఎన్నికలు: కేసీఆర్‌పై నారా లోకేష్ కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న టీఆర్ఎస్ నేతలకే మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ టికెట్స్ కేటాయించనున్నామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. ఆంధ్రా వాళ్లు వేసిన ఓట్లతో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను తన పక్కన కూర్చోబెట్టుకున్న కేసీఆర్ ఒకవైపు తెలుగువారంతా కలిసుండాలంటూనే.. మరోవైపు జాగో బాగో అని కామెంట్లు చేస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు.

మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీలో టీడీపీ నేతలు ఎంతమంది ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రోళ్లంటేనే పడని టీఆర్ఎస్ పార్టీ, వారి ఓట్లు వేయించుకోకుండానే జీహెచ్‌ఎంసీ పీఠాన్ని చేజిక్కించుకుందా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.