ఏపీకి సీఎస్‌గా రావడంపై స్పందించిన నీలం సహాని

ఏపీకి కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని

Updated: Nov 14, 2019, 02:14 PM IST
ఏపీకి సీఎస్‌గా రావడంపై స్పందించిన నీలం సహాని

అమరావతి: ఏపీకి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహని నేడు బాధ్యతలు తీసుకున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అనంతరం ఇంచార్జ్ సీఎస్‌గా వ్యవహరించిన నిరబ్ కుమార్ ప్రసాద్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీ సీఎస్ నీలం సహాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ నుంచి అధికారిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా తన ఉద్యోగ జీవితం మొదలైందన్న ఆమె.. మరోసారి ఏపీలో బాధ్యతలు నిర్వహించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.