మద్యం దుకాణాలు తెరవడంతో జనం ఇళ్లల్లో నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కూడా అదే తీరు కనిపించింది. వైన్ షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. మద్యం ధరలు భారీగా పెంచినప్పటికీ జనం ఏ మాత్రం ఖాతరు చేసినట్లు కనిపించలేదు.
ఇదిగో ఇక్కడ చూడండి.. ఇది విశాఖపట్నంలోని ఓ వైన్ షాప్ ముందు ఉన్న దృశ్యం. కనీసం ఇక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించడం లేదు. పైగా లైనులో నుంచి అంగుళం కదిలినా మద్యం దొరకదేమోనని బాధతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒకరినొకరు తోసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. కనీసం ఇక్కడ పోలీసులు కూడా లేకపోవడం గనించాల్సిన విషయం.
#WATCH Andhra Pradesh: Social distancing norms being flouted as people in large numbers queue outside a liquor shop in Visakhapatnam. #COVID19 pic.twitter.com/DvDNbBSCTC
— ANI (@ANI) May 5, 2020
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో వైన్ షాపులు కళకళలాడుతున్నాయి. ఎమ్మార్పీ ధరలను 70 శాతానికి పెంచినా జనం మద్యం కొనుగోళ్లు చేయడం కనిపించింది. ఏ దుకాణం దగ్గర చూసినా బారులు బారులుగా మందు బాబులు నిలబడి ఉన్నారు. పైగా ఉదయం 9 గంటలకు దుకాణం తెరిచే సమయం ఐతే.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షాపు ముందు క్యూ కట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఢిల్లీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై కరోనా పన్ను విధించడంతో మందు బాబులు అది కూడా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అది మేం దేశానికి ఇచ్చే విరాళం లాంటిదని చెప్పడం కొసమెరుపు.
#WATCH A man outside a liquor shop in Laxmi Nagar, Delhi says,"I'm here since 6 am. Shop was supposed to open at 9 am but police arrived at 8:55 am...who will be responsible if something untoward happens here? We've no issue with 70% tax, it's like a donation from us to country". pic.twitter.com/xnhycDLL4y
— ANI (@ANI) May 5, 2020