ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే ఛాన్స్ !!

ఒకే దేశం ఒకే రేషన్ పథకానికి తొలి అడుగు పడింది. తెలుగు రాష్రాల నుంచే అమలు మొదలైంది

Last Updated : Aug 9, 2019, 05:31 PM IST
ఇక నుంచి  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే ఛాన్స్ !!

తెలుగు రాష్ట్రాల్లో నివసించే పేదలకు గుడ్ న్యూస్. ఇక నుంచి రేషన్ కోసం సొంత ఊళ్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆంధ్ర వారు తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నా..తెలంగాణ వారు ఆంధ్ర ప్రాంతంలో నివాసముంటున్నా ..ఎవరు ఎక్కడుంటున్నా సరే..ఎక్కడి నుంచి రేషన్ కావాలంటే అక్కడి నుంచే తీసుకునే వెసులు బాటుకల్గింది. కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒకే రేషన్ కార్డు విధానం అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర  పౌరసరఫరాల శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ చేతుల ఈ పథకాన్ని ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో నుంచి మొదలు

తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టు కింద్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ ప్రాంతాలు ఒక యూనిట్ గాను... మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు మరో యూనిట్ గా తీసుకొని పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయించారు. దీన్ని అనుసరించి తెలుగు ప్రజలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. అలాగే గుజరాత్-మహారాష్ట్ర వాసులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే వెసులు బాటు కల్పించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే వచ్చే ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. వలసలకు వెళ్లే నిరుపేదలు రేషన్ కోసం ఇబ్బందులు పడకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

పోర్టబిలిటి విధానం ద్వారా...

ప్రస్తుతం ఒకే రేషన్ విధానం ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. లబ్దిదారుడి ఆధార్ నెంబర్ రేషన్ కార్డుతో సీడింగ్ చేసి పోర్టబిలిటి విధానం ద్వారా పేదలు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధానం గత ఏడాది నుంచే అమల్లోకి ఉంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ద్వారా ఆయా రాష్ట్రల పరిధిలో మాత్రమే రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది . అయితే తాజాగా కేంద్రం తీసుకొచ్చిన పథకం ద్వారా ఇక ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరబాద్ కు వలస వెళ్లిన ఎందరో పేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది.

Trending News