కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తును ప్రకటించిన కొద్ది రోజుల తరువాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జేఎస్‌పి, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

Last Updated : Jan 22, 2020, 10:57 PM IST
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

న్యూ ఢిల్లీ: జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తును ప్రకటించిన కొద్ది రోజుల తరువాత, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జేఎస్‌పి, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. సమావేశం జరిగిన వెంటనే మీడియాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర రాజధాని సమస్యపై చర్చించామని చెప్పారు. 

రాజధానిని వికేంద్రీకరించడానికి వైయస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన వ్యతిరేకించిందని, అమరావతిలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, భూ యజమానులకు మద్దతు ఇస్తోందని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు సోమవారం అసెంబ్లీలో ఆమోదించడంతో, అమరావతి ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగానే ఉంటుందని పవన్ కళ్యాణ్ నిరసనకారులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసరంగా దీర్ఘకాలిక పాలన ప్రణాళిక అవసరమని ఆయన అన్నారు.

అమరావతి అనేది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు సంబందించిన సమస్యన్నారు. రాజధాని కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందని ప్రజలకు, రైతులకు వాగ్దానం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధానిగా ఉండేలా జనసేన ప్రజల వెంట ఉంటుందని హామీ ఇచ్చారు. 

ఈ సమావేశంలో జీవిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దేవెదర్, జేఎస్‌పి నాయకుడు నాదెండ్ల మనోహర్, దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News