Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం..పవన్ సమక్షంలో అందజేత..!

Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు చెక్కును అందజేస్తున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jun 25, 2022, 08:57 PM IST
  • కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ
  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం
  • తాజాగా పవన్‌ తల్లి సాయం
Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు అమ్మ సాయం..పవన్ సమక్షంలో అందజేత..!

Pawan Kalyan: జనసేన కౌలు రైతు భరోసాకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలు రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందిస్తున్నారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు చెక్కును అందజేస్తున్నారు. తాజాగా జనసేన కౌలు రైతు భరోసాకు పవన్‌ తల్లి అంజనాదేవి ఆర్థిక సాయం అందించారు. పవన్‌ తండ్రి కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.లక్షన్నర విరాళం అందజేశారు. పార్టీకి మరో రూ.లక్షల విరాళం ఇచ్చారు.

హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌కు ఇందుకు సంబంధించిన చెక్కులను అంజనాదేవి అందించారు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. తన పెన్షన్‌ డబ్బులను అమ్మ కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలకు ఈసాయం ఎంతో భరోసాను ఇస్తోందని చెప్పారు.

తన తండ్రి అబ్కారీ శాఖలో పనిచేసేవారని..ఆయనకు వచ్చిన జీతంతోనే తామంతా పెరిగామన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అమ్మకు పెన్షన్‌ రావడం మొదలైందని..పెన్షన్‌ డబ్బులను దాచుకోవడం అమ్మకు అలవాటు అని తెలిపారు. ఆ సొమ్మును కౌలు రైతులకు ఇవ్వడం స్ఫూర్తిదాయకమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగించాలని డిమాండ్  చేశారు. ఈవిషయంలో ఉద్యోగులకు తమవంతుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Also read: Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్ తప్పదా..ఇవాళ్టి కేసులు ఎన్నంటే..!

Also read: PM Modi Tour: తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఫిక్స్..రోడ్‌ షోలపై బీజేపీ నేతల స్కెచ్‌లు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Linkhttps://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News