Pawan Kalyan Latest: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనంగానే మారుతుంది. తాజాగా అసెంబ్లీ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే పెద్ద చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో పవన్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై తెగ ప్రశంసలు జల్లు కురిపించారు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అంటూ ఆకాశానికెత్తారు. అంతటితో ఆగని పవన్ కళ్యాన్ చంద్రబాబు మరో పదేళ్లు ఏపీ సీఎంగా ఉండాలని కోరకుంటున్నానని పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపైనే ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అని జనసైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. తామేమో తమ అధినేత సీఎం కావాలని అనుకుంటుంటే ఈయనేమో మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండమని అంటున్నారని జనసైనికులు తెగ ఫీలవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇక నుంచి జనసేన కీలక పాత్ర పోషిస్తుందని తామంతా భావిస్తుంటే పవన్ మాత్రం చంద్రబాబు ఏపీకీ నాయకత్వం వహించాలని మాట్లాడడం జనసైనికులకు ఏ మాత్రం రుచించడం లేదంట. మరీ ముఖ్యంగా పవన్ సామాజిక వర్గంతో పాటు కొన్ని బీసీ సామాజికవర్గాలు పవన్ మాటలను తీవ్రంగా తప్పుబడుతున్నారని జనసేనలో జరుగుతున్న చర్చ.
జనసేన పార్టీ పెట్టిన దాదాపు దశాబ్దకాలం తర్వాత పవన్ కళ్యాన్ రాజకీయంగా మొన్నటి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించారు. ఏకంగా 21 సీట్లలో పోటీకీ దిగి అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. వందకు వంద శాతం సక్సెస్ రేట్ తో ఎన్నికల్లో విజయం సాధించడం పవన్ కళ్యాణ్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దీంతో రాజకీయంగా మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో ఇక ముందు పవన్ పని చేస్తారని అనకున్నామని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రజలు పవన్ నాయకత్వాన్ని బలపర్చారని ఇలాంటి తరుణంలో పవన్ ఇలా మాట్లాడం కరెక్ట్ కాదనేది వారి భావన.
మరోవైపు పవన్ కామెంట్స్ పై ఒక్కొక్కరి విశ్లేషణ ఒక్కోలా ఉంటుంది. కొందరేమో చంద్రబాబు గత అనుభవాల దృష్ట్యా విజనరీ లీడర్ షిప్ ను బలపర్చడానికి పవన్ అలా మాట్లాడి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. టీడీపీతో, చంద్రబాబుతో ఉన్న తనకు ఉన్న బంధాన్ని మరోసారి బలంగా చెప్పాలనే ప్రయత్నంలోనే ఇలా మాట్లాడారు అనేది ఇంకొందరు అంటున్నారు.మరి కొందరు మాత్రం పవన్ మాటల్లో చాలా అర్థమే దాగి ఉందని విశ్లేషిస్తున్నారు. ఇటీవల లోకేశ్ సీఎం అవుతారంటూ పెద్ద ఎత్తున ఏపీలో చర్చ జరుగుతుంది. దానికి కౌంటర్ గానే పవన్ ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకు తన మద్దతు ఉంటుందని అది కానీ పక్షంలో తన రాజకీయ నిర్ణయం మరోలా ఉంటుందనేది బాబుకు తెలియాలనే ఇలా మాట్లాడి ఉంటారనేది వారి వాద.
మొత్తానికి చంద్రబాబుపై పవన్ చేసిన కామెంట్స్ మాత్రం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పవన్ మాటలకు అర్థాలే వేరులే అని కొందరు మాత్రం అనకుంటున్నారు.భవిష్యత్తులో పవన్ ను మరింత ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్న అభిమానులకు మాత్రం ఈ కామెంట్స్ అస్సలు మింగుడు పడడం లేదు.పవన్ ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేశారు , దాని వెనుక ఉన్న వ్యూహం ఏంటి అనేది మాత్రం తేలాల్సింది భవిష్యత్తులోనే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.