పవన్ రూటే సెపరేటు ; జనసేన అభ్యర్ధుల ఎంపికలో ఆ కమిటీలే కీలకం

కమిటీల ఏర్పాటు విషయంలో రాజకీయ పార్టీలకు భిన్నంగా  జనసేన చీఫ్ పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 

Last Updated : Jan 20, 2019, 08:08 PM IST
పవన్ రూటే సెపరేటు ; జనసేన అభ్యర్ధుల ఎంపికలో ఆ కమిటీలే కీలకం

సంస్థగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టిసారించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన కో ఆర్డినేటర్లు, సబ్ కోఆర్డినేటర్లను నియమించారు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు భిన్నంగా జిల్లాల వారీగా  కాకుండా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. 

కమిటీల కూర్పు ఇదేనా..
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నింటిలో 25 కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి కమిటీలో 25 మందికి స్థానం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రతి అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి ఇద్దరు సభ్యులను పార్లమెంట్ కమిటీలో చోటు కల్పించాలని భావిస్తున్నారు. ఈ కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఎంపిక చేసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పార్లెమెంట్ కమిటీల ఎంపిక కీలకంగా మారింది.

ఆశావహుల ఆశలు నెరవేరేనా ?
వాస్తవానికి సంక్రాతి ముందే పార్లమెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ భావించారు. అయితే  కసరత్తు పూర్తికానందుకు ప్రకటించలేకపోయారు. కమిటీలో స్థానంలో కోసం ఆశావహులు అనేక మంది పోటీ పడటంతో అసంతప్త బెడద లేకుండా చూడాలనే ఉద్దేశంలో ఈ కమిటీపై లోతైన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో సామాజిక సమీకరణలతో పాటు మహిళలకు స్థానం ఇవ్వాల్సి ఉంది. అలాగే సమర్ధత, పేరు ప్రతిష్ఠలు..ఇలా అనేక సమీకరణలు చూసుకోవాల్సి ఉంది. లెక్కలన్నీ సరిచూసుకొని ఈ నెలలాలోగా కమిటీలు ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీలో సభ్యత్వం కీలకంగా మారడంతో ఆశవాహులు కమిటీలో స్థానం కోసం తమవంతు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది.

బూత్ స్థాయి వరకు ఇదే ఫార్ములా 

పార్లమెంట్ కమిటీలు పూర్తయితే ఇదే తరహాలో అసెంబ్లీ స్థాయి కమిటీలు వేయాలని పవన్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్నికల నాటికి  ఇలా బూత్ స్థాయిలో కమిటీలో వేసుకొని పార్టీ సంస్థగత నిర్మాణం చేసుకోవాలని పవన్ భావిస్తునారు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినందున..పొత్తులు లేకపవడంతో తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఆశవహులు క్యూకడుతున్నారు.

క్యూకడటానికి కారణం ఇదే ..
పార్లమెంటరీ కమిటీల్లో చోటు దక్కిన వారికే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారన్న జోరుగా ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ కమిట్లీల్లో సభ్యుల సంఖ్య పాతిక వరకు ఉండేటట్టు ప్రచారం జరుగుతుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇద్దరేసి పేర్లకు తగ్గకుండా ప్రతిపాదించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరి అసెంబ్లీ అభ్యర్ధిగా ప్రకటించే అవకావమున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో అందరి దృష్టి పార్లమెంటరీ కమిటీలపై పడింది. 

Trending News