PM Modi Speech: ఏపీ ప్రజలు స్వభావరీత్యా..ఎక్కడైనా స్థిరపడగలరు

PM Modi Speech: విశాఖపట్నం సభ భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుగా..స్టాల్స్ పరిశీలించారు. అనంతరం వేదికపై చేరుకున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 12, 2022, 11:49 AM IST
PM Modi Speech: ఏపీ ప్రజలు స్వభావరీత్యా..ఎక్కడైనా స్థిరపడగలరు

సభావేదికపై చేరుకోగానే ముందుగా ప్రజలకు అభివాదం చేశారు. వేదికపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఉన్నారు. శాలువాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ..తెలుగులో ప్రారంభించి..హిందీలో కొనసాగించారు.

ప్రధాని మోదీ ప్రసంగం..ఆయన మాటల్లోనే..

ప్రియమైన సోదరీ సోదరులారా...నమస్కారం...

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర పెద్దలకు, రాష్ట్ర సోదర సోదరీమణులకు నా అభినందనలు..

కొద్ది నెలల క్రితమే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా మీ మధ్యకు వచ్చే అవకాశం కలిగింది. ఇవాళ మరోసారి ఆంధ్రప్రదేశ్ నేలపైకి వచ్చారు. ఈరోజు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజు. విశాఖపట్టణం దేశంలోని చాలా ప్రత్యేకమైన నగరం. ఇక్కడ వ్యాపారం చాలాకాలం నుంచి అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నం ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ ఓడరేవు. ప్రాచీనకాలం నుంచి ఇది జరుగుతోంది. ఇవాళ కూడా విశాఖపట్టణం దేశ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారింది. 

10వేల కోట్ల ప్రాజెక్టులు దేశానికి అంకితం, శంకుస్థాపనలు విశాఖపట్నం అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ పధకాలు, మౌళిక పధకాలు అభివృద్ధికి కొత్త శిఖరాలు చేరుస్తుంది. దేశ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ఎప్పుడూ కలిసినా రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ స్వభావం రీత్యా స్నేహపూర్వకంగా, ఔత్సాహికంగా ఉంటారు. ఇవాళ దాదాపుగా ప్రపంచంలోని ప్రతి మూల, ప్రతి  దేశంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. విద్యారంగమైనా, వ్యాపారమైనా, సాంకేతికత అయినా, వైద్యరంగమైనా...ప్రతిరంగంలోనూ విశిష్టమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఈ గుర్తింపు కేవలం వృత్తిపరంగానే కాదు..తమ కలుపుగోలుతనం కారణంగా..భిన్నమైన వ్యక్తిత్వం కారణంగా ప్రతి ఒక్కరినీ ఆకర్షింపచేస్తుంది. తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ ఉత్తమమైంది, బెస్ట్ చేయాలని కోరుకుంటారు. ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమాల్ని అయితే ప్రారంభిస్తున్నామో అవి రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయని అనుకుంటున్నాను.

ఆజాదీగా అమృత్ మహోత్సవ్ సమయంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఈ అభివృద్ధి యాత్ర చాలా ప్రత్యేకతమైంది. ఇందులో సాధారణ ప్రజల ఆలోచన కూడా దాగుంది. ప్రపంచంలో శ్రేష్ణమైన మౌళిక నిర్మాణాల తోడ్పాటు ఉంది. 

మౌళిక సదుపాయాల కల్పన విషయంలో ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ఏ విధమైన సందేహానికి లోనుకాలేదు రైల్వేల్ని అభివృద్ధి చేయాలా..రోడ్ల అభివృద్ధి చేయాలా అనే విషయంపై సందేహపడలేదు. పోర్టుల్ని అభివృద్ధి చేయాలో మరొకటి అభివృద్ధి చేయాలా అనే మీమాంసకు లోనుకాలేదు.

ఇవాళ అభివృద్ధి చేస్తున్న ఎకనమిక్ కారిడార్‌లో 6 లైన్ల రహదారులు,  పోర్టుకు చేరేందుకు ప్రత్యేక రోడ్డు అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్, హార్బన్ ఆధునీకరణ చేస్తున్నాం. మౌళిక సదుపాయాల విషయంలో మేం చేపడుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ అభివృద్ది చాలా కీలకం. మల్టీమోడల్ లాజిస్టిక్స్ అనేది చాలా ఉపయోగమౌతుంది. విశాఖపట్నంకు కూడా మరింత అభివృద్ధికి దోహదపడుతుంది. చాలాకాలంగా నిరీక్షిస్తున్న మీ కల ఇవాళ సాకారం కానుంది.

ఇవాళ ఆంద్రప్రదేశ్‌తో పాటు తీర ప్రాంతాలు అభివృద్ధి పథంలో దూసుకుపోనున్నాయి. ఇవాళ ప్రపంచమంతా  ఇబ్బందులతో నడుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆకలి, నిత్యావసరాలు, ఇతర సంక్షోభం, ఆర్ధిక మాంద్యం నెలకొంది. కానీ ఇండియా చాలా రంగాల్లో అభివృద్ధికి కొత్త శిఖరాలను చేరుకుంటోంది. ప్రపంచం కూడా మీవైపు నిశితంగా పరిశీలిస్తోంది. 

మీరు చూస్తుండి ఉండవచ్చు. ఇవాళ భారతదేశం  ఏ విధంగా అందరూ దేశాన్ని ప్రశంసిస్తన్నారో..ప్రపంచం మొత్తం ఆశలకు , ఆలోచనలకు కేంద్ర బిందువుగా మారింది. ఇలా ఎందుకు సాధ్యమైందంటే..భారతదేశం పౌరుల ఆలోచన, ఆశలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ పనిచేస్తోంది. మనలోని ప్రతి నిర్ణయం, ప్రతి గుణం సాధారణ మనిషి జీవితాన్ని మెరుగుపర్చడం కోసమే.

ఇవాళ ఓవైపు జీఎస్టీ, ఐబీసీ, జాతీయ మౌళిస సదుపాయాల పైప్‌లైన్, గతిశక్తి వంటి పాలసీల కారణంగా ఇండియాలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరోవైపు పేదలకోసం సంక్షేమ పథకాలు విస్తారమౌతున్నాయి. 

ఈ అభివృద్ది యాత్రలో ఇప్పటి వరకూ నిర్లక్షానికి గురైన దేశంలోని మారుమూల ప్రాంతాలు కూడా చేర్చబడ్డాయి. వెనుకబడిన జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశంలోని కోట్లాది రైతులకు ఉచిత బియ్యం అందిస్తున్నాం. గత మూడున్నరేళ్లుగా రైతు ఖాతాలో ప్రధానమంత్రి కిసాన్ వికాస్ సమ్మాన్ యోజన ద్వారా ప్రతి యేటా 6 వేల రూపాయలు చేరుతున్నాయి. 

ఇదే విధంగా సన్‌రైజ్ సెక్టార్‌కు చెందిన మన పాలసీల ఆధారంగా ద్రోన్ నుంచి గేమింగ్ వరకూ, అంతరిక్షం నుంచి స్టార్టప్ వరకూ ప్రతి రంగంలో ముందుకెళ్లేందుకు అవకాశం లభిస్తోంది. మిత్రులారా...లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆకాశపు ఎత్తులైనా, సముద్రపు లోతైనా అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో విజయం సాధిస్తాం. ఇవాళ ఆధునిక పరిజ్ఞానం ద్వారా సముద్రంలోపల దాగున్న ఇంధనాన్ని వెలికి తీయగలుగుతున్నాం.

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణతో విశాఖపట్నం మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పేదల శక్తి సామర్ధ్యాలు పెరిగేకొద్దీ ఆధునిక వసతులు పేదలకు చేరుతాయో వికాస్ భారత్ ఉద్దేశ్యం నెరవేరుతుంది. అనాదిగా సముద్రతీర ప్రాంతాలు వ్యాపారానికి మూలకేంద్రంగా నిలిచాయి. ఇవాళ దేశంలో వేలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న పోర్డుల అభివృద్ది మున్ముందు ఇంకా విస్తృతమౌతుంది.

మిత్రులారా..ఈ సంకల్పంతో మరోసారి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు..
భారత్ మాతాకీ జై...భారత్ మాతాకీ జై...

Also read: Pawan Kalyan Meets PM Modi: ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ ముఖ్యాంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News