పౌరులకు అండగా నిలిచే చట్టం

పౌరులకు సేవలందించడంతో పాటు.. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా  ప్రజా సేవల హామీ చట్టం-2017 రూపొందించామని మంత్రి అమర్‌నాథ్ రెడ్డి  చెప్పారు.

Last Updated : Nov 24, 2017, 12:49 PM IST
    • పౌరులకు అండగా చట్టం
    • నిర్ణీత గడువు విధింపు
    • పరిష్కరించపోతే సంబంధిత అధికారి నుంచి జరిమానా చెల్లింపు
పౌరులకు అండగా నిలిచే చట్టం

పనుల కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతారు.. డబ్బు ఇచ్చినా ఆ పని ఎప్పుడవుతుందో తెలియదు.. నా బాధలు ఎప్పుడు తీరుతాయి.. డబ్బులు పోయాయి.. సమయం  కూడా వృధా అయిపోయింది..  ఇలా అనుకొనే వారుంటారు.

.. ఇలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం  మంగళవారం శాసన సభలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ చట్టం పేరు "ప్రజా సేవల హామీ చట్టం-2017". ఈ చట్టం రాష్ట్ర పౌరుల కోసమే అని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆయన పౌరులకు సేవలందించడంలో.. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీ తనం పెంపొందించేలా ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. 

పౌరులకు అండగా నిలిచే ఈ చట్టంలోని అంశాలు

* ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ఒక నెంబర్ కేటాయిస్తారు. పరిష్కారానికి నిర్ణీత గడువు నిర్ణయిస్తారు.  

*  సకాలంలో ఆ సేవలను సంబంధిత శాఖ అందించాలి. ఆలస్యమైతే.. ఎందుకు ఆలస్యమవుతుందో ముందుగానే సదరు అధికారి దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా తెలియజేయాలి. 

* అలా కానిపక్షంలో దరఖాస్తుదారుడు కాలయాపనకు జరిమానా చెల్లించాలని కోరుతూ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. 

* ఆలస్యం అయినందుకు సంబంధిత అధికారి దరఖాస్తుదారుడికి జరిమానా చెల్లిస్తాడు.

Trending News