Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి కింద పడటంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Last Updated : Oct 30, 2020, 12:03 PM IST
Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Van overturned in AP - Seven people died: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ( road accident ) సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి కింద పడటంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా ( East Godavari ) లోని గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చోటుచేసుకుంది. మండలంలోని టాకుర్‌పాలెం యువకుడు.. రాజనగరం మండలం వెలుగుబందాకు చెందిన యువతికి గురువారం రాత్రి తంటికొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. Also read: BJP workers murder: బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి

అనంతరం వధూవరుల కుటుంబసభ్యులు దాదాపు 20 మంది వ్యానులో కొండపై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అర్థరాత్రి వ్యాన్ అదుపుతప్పి మెట్ల మార్గం నుంచి కొండ కిందకు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యానులో 22 మంది ప్రయాణికులు ఉన్నారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.  Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x