RTC Women Passengers: ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు. ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రిపూట విశాఖపట్టణంలో కలకలం రేపింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది చదవండి: Wife Boyfriend: మద్యంలో విషం కలిపినా చావని భర్త.. చివరకు భార్య ఏం చేసిందంటే
విశాఖపట్టణంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లాడు. యాసిడ్ దాడితో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును నిలిపివేశారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు పారిపోయాడు. యాసిడ్ దాడితో కళ్లు మండుతుండడంతో మహిళలను వెంటనే స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనతో కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇది చదవండి: Red Sandalwood: 'పుష్ప'ను మించి ఎర్రచందనం స్మగ్లింగ్.. శేషాచలంలో 12 మంది కూలీలు అరెస్ట్
యాసిడ్ దాడి చేసిన వ్యక్తి గురించి ప్రయాణికులను ఆరా తీయగా అతడి వివరాలు తెలియదని చెప్పారు. ఎందుకు దాడి చేశాడని తెలియడం లేదు. దుండగుడి ఆచూకీ కోసం పోలీసులు సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. బాధిత మహిళల్లో నిందితుడి సంబంధికులు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు విచారిస్తున్నారు. యాసిడ్ దాడికి ప్రేమ వ్యవహారమా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. లేదంటే నిందితుడు మానసిక పరిస్థితి సక్రమంగా లేదా? అని సందేహాలు వస్తున్నాయి. కాగా విశాఖపట్టణంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల మహిళలపై దాడులు పెరిగాయని.. గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని విశాఖపట్టణం మహిళలు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter