Special Trains From Secunderabad: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ బలహీనపడుతోంది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విధించిన లాక్‌డౌన్, కర్ఫ్యూలు సడలింపు ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో సామాన్యుడి వాహనమైన రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచే ఆ ప్రత్యేక రైలు సర్వీసులు కొన్ని ప్రారంభం అవుతున్నాయి. సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్, హౌరా - యశ్వంత్‌పూర్ రైలు సర్వీసులను నడపాలని సౌత్ సెంట్రల్ రైల్వే భావించింది. వీటిలో షాలిమార్ - సికింద్రాబాద్ (02449) రైలు సర్వీస్ జూన్ 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్ (02450) ప్రతి శుక్రవారం నాడు అంటే జూన్ 11, 18, 25 మరియు జూలై 2 తేదీలలో ఉదయం 4:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
Also Read: Galaxy S21 Mobiles: రూ.10,000 Cashback ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Samsung
మరో రైలు సర్వీసు హౌరా - యశ్వంత్‌పూర్ స్పెషల్ ట్రైన్ (02469) ప్రతి గురువారం.. జూన్ 10, 17, 24 తేదీల్లో మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రారంభమై శుక్రవారం (గురువారం అర్ధరాత్రి 01:45) విశాఖపట్నానికి చేరుకుంటుంది. 2 గంటల 5 నిమిషాకలకు అక్కడి నుంచి యశ్వంత్‌పూర్‌కు బయలుదేరుతుంది.
యశ్వంత్‌పూర్ - హౌరా ప్రత్యేక రైలు సర్వీసు (02470) ప్రతి ఆదివారం.. జూన్ 13, 20, 27 తేదీల్లో ఉదయం 5:15 గంటలకు ప్రారంభమై రాత్రి 11:10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. వైజాగ్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు హౌరాకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లలో 20 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవి రిజర్వేషన్ రైళ్లు అని గుర్తుంచుకోండి.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 09 జూన్ 2021, ఓ రాశివారికి ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook