Srisailam Project: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతుండటంతో ఆయా ప్రాంతాల్లోని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల కారణంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చూస్తే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువరు కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. ముఖ్యంగా ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహాం కొనసాగుతూనే ఉంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలంలోకి 4 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పొతిరెడ్డి పాడు నుంచి 18 వేల క్యూసెక్కులు, కల్వకురి నుంచి 1600 క్యూసెక్కులను తరలిస్తున్నారు.
కుడి, ఎడమ ప్రాజెక్ట్ ల్లో విద్యుత్పత్తి చేస్తూ 61 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 160 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ఇవాళ శ్రీశైలం క్లస్టర్ గేట్లు ఓపెన్ చేసి సాగర్ లోకి నీటిని రిలీజ్ చేయనున్నారు అధికారులు.
ఈ సందర్భంగా ఏపికి చెందిన ఇరిగేషన్ అధికారులు.. ఈ రోజు రాత్రి కృష్ణమ్మకు ప్రత్యేక నిర్వహించి.. చీర సారాను నదిలో శాస్త్రోక్తంగా విడిచి పెట్టిన తర్వాత శ్రీశైలం క్రస్టు గేట్లను ఓపెన్ చేయనున్నారు. మొత్తంగా ఇధి వరద శ్రీశైలం ప్రాజెక్టు లో కొనసాగితే.. మరో 15 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter