పోలవరం ప్రాజెక్టు ఆపండి: ఒరిస్సా ప్రభుత్వం

ఆంధ్రదేశాన్ని సస్యశ్యామల క్షేత్రంగా మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని.. ఆ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఏర్పడే పలు సమస్యలు పూర్తిగా తీరేవరకు వాయిదా వేయాలని ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Last Updated : Dec 1, 2017, 11:21 AM IST
పోలవరం ప్రాజెక్టు ఆపండి: ఒరిస్సా ప్రభుత్వం

ఆంధ్రదేశాన్ని సస్యశ్యామల క్షేత్రంగా మార్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలని.. ఆ ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు ఏర్పడే పలు సమస్యలు పూర్తిగా తీరేవరకు వాయిదా వేయాలని ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశా ప్రాంతానికి జరగబోయే పర్యావరణ నష్టం గురించి, ఏపీ సీఎం చంద్రబాబుకి గతంలోనే చెప్పామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. గోదావరి నీటి వివాద పరిష్కారాల ట్రిబ్యూనల్ సూచనల మేరకు ఈ ప్రాజెక్టు నిర్మించాలని.. ట్రిబ్యూనల్ నుండి అనుమతుల క్లియరెన్స్ రాకుండానే ప్రణాళికలు, ప్లాన్‌లు వేయడం ఎంత వరకు సముచితమని.. పోలవరం ప్రాజెక్టు ఏ విధానాల మేరకు కడుతున్నారో ఒడిశా ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎదుట ఈ అంశాలకు చెందిన కేసు కూడా పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పారు. 

Trending News