Chandrababu Naidu: పవన్‌పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం

Chandrababu Naidu Supports to Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేయడంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేత ధోరణి మానుకోవాలన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jul 21, 2023, 02:54 PM IST
Chandrababu Naidu: పవన్‌పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య.. చంద్రబాబు నాయుడు ఆగ్రహం

Chandrababu Naidu Supports to Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. పవన్‌పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు.. రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు అనేది ఈ రాక్షస ప్రభుత్వ విధానమైందని విమర్శించారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని.. ఈ అణచివేత ధోరణి మానుకోవాలని హితవు పలికారు.

నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే కేసు పెడతారా..? అని చంద్రబాబు నిలదీశారు. ప్రజల వ్యక్తిగత వివరాలు.. కుటుంబ వ్యవహారాలపై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పు అని అన్నారు. పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచమని పేర్కొన్నారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్‌పై ముందు కేసు పెట్టి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  

"ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే పెద్ద జోక్. 4 ఏళ్ల మీ దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయి. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి.. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు, వ్యక్తిగత దాడి.. మీ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి.." అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

రాష్ట్రంలో ఇటీవల వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి కారణం వాలంటీర్లేనంటూ కామెంట్స్ చేశారు. వాలంటీర్లు సేకరించిన డేటా.. సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళుతుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం 199/4 ప్రకారం కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం కేసులు పెట్టాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశించింది. ఈ జీవోపై స్పందించిన పవన్ కళ్యాణ్.. తనను అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానించారు. జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని.. దెబ్బలు తినడానికి అయినా రెడీ అన్నారు. 

Also Read: CM Jagan Mohan Reddy: పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్‌.. తొలిసారి రియాక్షన్‌  

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News