CM Jagan Mohan Reddy: పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్‌.. తొలిసారి రియాక్షన్‌

CM Jagan Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తోపాటు నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం జగన్. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేతన్న నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాలో శుక్రవారం జమ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 21, 2023, 01:44 PM IST
CM Jagan Mohan Reddy: పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్‌.. తొలిసారి రియాక్షన్‌

CM Jagan Comments on Pawan Kalyan: వాలంటీర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు. మంచిచేస్తున్న వ్యవస్థలపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే అలాంటి వారిగురించి మాట్లాడాల్సి వస్తోందన్నారు. వాలంటీర్లు అందరికీ తెలిసన వారేనని.. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా.. వాళ్లు పనిచేస్తున్నారని అన్నారు. వారంతా మన కుటుంబ సభ్యులు అని.. అవినీతికి, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్నారని చెప్పారు. మన ఊరి పిల్లలైన వాలంటీర్ల మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. స్క్రిప్టు రామోజీరావుది.. నిర్మాత చంద్రబాబు.. యాక్షన్‌ పవన్‌ కళ్యాణ్‌ అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ.193.64 కోట్ల నేతన్న నేస్తం నిధులను తిరుపతి వెంకటగిరిలో సీఎం జగన్ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క నేతన్న కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో నేతన్న ఆత్మహత్యలు ఉండేవని.. తాము అధికారంలోకి వచ్చాక వారికి అండగా నిలబడ్డామని అన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ చెత్త బుట్టలో వేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక నేతన్న నేస్తం పథకం ద్వారా 80,686 మందికి లబ్ధిచేకూర్చామన్నారు. నేతన్నలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వంలో చేనేత పెన్షన్లు కింద రూ.1396 కోట్లు, నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా రూ.871 కోట్లు, ఆప్కో బకాయిలు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు మొత్తంగా రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చేనేత వస్త్రాలు అమ్మకాలను ప్రోత్సహించామని చెప్పారు.

వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. "వాలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరు అంటారు. హ్యూమన్‌ ట్రాఫిక్‌ చేస్తారని ఇంకొకరు అంటారు. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రచారం చేస్తున్నారు. 2.6 లక్షలమంది వాలంటీర్లలో 60 శాతం మంది మహిళలే. వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారవంతులు. ఇలాంటి వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టిన వారు ఎవరంటే.. ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వాలంటీర్‌.. ప్యాకేజీ స్టార్‌, ఇంకొకరు చంద్రబాబు. 

వాలంటీర్ల క్యారెక్టర్‌ గురించి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు ఎలాంటి వారో సేవలు అందుకుంటున్న వారికి తెలుసు. చంద్రబాబు క్యారెక్టర్‌, దత్తపుత్రుడి క్యారెక్టర్‌, ఆయన సొంతపుత్రుడి క్యారెక్టర్‌, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్‌ ఏంటో ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా..? లేక దత్తపుత్రుడు ఇదే కార్యక్రమం పెట్టుకుని అమ్మాయిలను లోబరుచుకున్నారా..? ఒకరిని పెళ్లిచేసుకోవడం.. నాలుగేళ్లు కాపురం చేయడం మళ్లీ వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం.. మళ్లీ వదిలేయడం.. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో సంబంధం. ఇలాంటి క్యారెక్టర్‌ ఎవరది..?

పట్టపగలే మందుకొడుతూ.. 10 అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌లో డ్యాన్స్‌ చేసేవాడు ఇంకొకడు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంటాడు.. లేకపోతే కడుపైనా చేయాలంటాడు ఇంకొక దౌర్భ్యాగ్యుడు. వయస్సు 75 ఏళ్లు అయినా సిగ్గులేదు.., ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనులను గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు." అంటూ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి క్యారెక్టర్‌లేని వాళ్లంతా మంచి చేస్తున్న మన వాలంటీర్లు గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని.. చంద్రబాబుతో కాపురం చేస్తున్నాడని అన్నారు.

Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు  

Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News