Bojjala Gopala Krishna Reddy: టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి..

Bojjala Gopala Krishna Reddy: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 04:37 PM IST

    టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి

    శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యే

    బొజ్జల మృతితో టీడీపీలో విషాదం

Bojjala Gopala Krishna Reddy: టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి..

Bojjala Gopala Krishna Reddy: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం భారీన పడటంతో.. దాదాపు మూడు నెలల పాటు హాస్పిటల్ లోనే ఉన్నారు బొజ్జల. పరిస్థితి కాస్త మెరుగు పడటంతో కొన్ని రోజుల క్రితం ఇంటికి తీసుకువెళ్లారు. అయితే మళ్లీ ఆరోగ్యం విషమించడంతో తిరిగి అపోల్ హాస్పిటల్ కు తరలించారు.

చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. శ్రీకాళహస్తి నియోజరవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బొజ్జల. బాబు నాయుడు మంత్రివర్గంలో ఫారెస్ట్ మంత్రిగా పని చేశారు. టీడీపీ కార్యక్రమాల్లో చంద్రబాబుకు అండగా ఉండేవారు. 2013లో అలిపిరి దగ్గర అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు.

ఇటీవలే బొజ్జల పుట్టినరోజు జరిగింది. చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. బొజ్జలతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలు జరిపారు. తెలుగు దేశం పార్టీ పేరుతో తయారు చేయించిన కేక్ ను స్వయంగా బొజ్జలకు తినిపించారు చంద్రబాబు. బొజ్జల మృతితో టీడీపీ విషాదం నెలకొంది. బొజ్జల మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం టీడీపీకి తీరని లోటన్నారు చంద్రబాబు.

READ ALSO: teenmar mallanna shocking decision: కేసీఆర్‌ను తిట్టనని ఒట్టేసిన తీన్మార్‌ మల్లన్న

Chandrababu Ready To Allaince: పొత్తులకు సిద్ధమన్న చంద్రబాబు.. జనసేన, బీజేపీకి స్నేహ హస్తం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News