Car Accident: కొత్త కారులో దావత్ కి వెళ్తూ యాక్సిడెంట్‌ తో ముగ్గురు మృతి

మృత్యువు ఏ రూపంలో ఎలా సంభవిస్తుందో  తెలియదు. కొత్త కారు కొన్న మురిపంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకొని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గురు మరణించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జరిగింది. ఆ వివరాలు..   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 06:00 PM IST
Car Accident: కొత్త కారులో దావత్ కి వెళ్తూ యాక్సిడెంట్‌ తో ముగ్గురు మృతి

Car Accident in Ananthapur: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు. రోడ్డు మీదకు వెళ్లిన వారు ఎలా వస్తారో తెలియని పరిస్థితి ఉంది. బయటకు వెళ్లిన వారు ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేదు అన్నట్లుగా రోజులు మారాయి. సమయం బాగా లేకపోతే ఏ రూపంలో అయిన మృత్యువు ఒడికి చేరే అవకాశాలు ఉంటాయి. 

నిమిషం ముందు వరకు నవ్వుతూ తుల్లుతూ ఉన్న వారు గుండె పోటు లేదా యాక్సిడెంట్ తో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు మన చుట్టూ రోజు జరుగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో శనివారం అదే జరిగింది. పార్టీ కోసం బయటకు వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. వారి కుంటుంబాల్లో కడుపు కోత మిగిల్చడంతో పాటు కుటుంబ సభ్యులను అనాధలుగా మార్చి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం రావి వెంకటపల్లెలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి కారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం ఇటీవల మోహన్ రెడ్డి కారును కొనుగోలు చేయడం జరిగింది. 

ఆ సందర్భంగా పార్టీని ఇస్తానంటూ స్నేహితులను ఆహ్వానించాడు. రాత్రి పార్టీ ఇచ్చాడు. ఫ్రెండ్స్ అంతా కూడా ఫుల్‌ గా తిని, తాగేసి ఆనందంలో చక్కర్లు కొట్టారు. కారులో లాంగ్ డ్రైవ్‌ వెళ్లిన వారు తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ అయింది. 

Also Read: Ys jagan to Vizag: విశాఖ నుంచి పాలనకు ముహూర్తం ఫిక్స్,జగన్ షిఫ్టింగ్ ఎప్పట్నించంటే

శనివారం కారులో ప్రయాణిస్తున్న సమయంలో అదుపు తప్పి కారు చెట్టుకు ఢీ కొట్టింది. మోహన్ రెడ్డి కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న మోహన్‌ రెడ్డితో పాటు కారులో ఉన్న విష్ణు వర్ధన్‌, నరేష్ రెడ్డిలు మృతి చెందారు. శ్రీనివాసరెడ్డి మాత్రం గాయాలతో బయట పడ్డాడు. 

ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి చికిత్స తీసుకుంటున్నాడు. తీవ్ర గాయాలతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి కారు కొన్న పార్టీ అంటూ బయటకు వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ముగ్గురు మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. 

అందుకే పరిస్థితులు ఏ సమయం లో ఎలా ఉంటాయో తెలియదు. కనుక జాగ్రత్త తప్పనిసరి. అత్యుత్సాహం అస్సలు వద్దని పెద్దలు అంటూ ఉంటారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. మధ్యం తాగి అతి వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు.

Also Read: Pawan Kalyan: ఆ లక్ష్యంతోనే పదేళ్ల పాటు పార్టీని నిర్మించుకున్నా.. చాలా ఇష్టంతో ఇక్కడికి వచ్చా: పవన్ కళ్యాణ్‌  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News