Pawan Kalyan Meeting with NRI Gulf Members: "కరడుగట్టిన, కఠిన చట్టాలు ఉండే గల్ఫ్ దేశాలకు వెళ్లి బతకగలం.. మన దేశంలో మాత్రం బతకడానికి ఇబ్బందిపడే పరిస్థితి మన రాష్ట్రంలోనే నెలకొంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది లేదు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల మధ్య రూల్స్ పాటిస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించే బలమైన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాం.." అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో దౌర్జన్యం, రౌడీయిజం చేయగలిగిన వాడే రాజకీయ నాయకుడు అన్నట్టు పరిస్థితి తయారైందని అన్నారు. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారని.. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం తన చివరి శ్వాస వరకు తన నేల కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ గల్ఫ్ విభాగం సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆరు గల్ఫ్ దేశాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐ జన సైనికులు పార్టీకి రూ.కోటి విరాళం అందజేశారు. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ.లక్షా 10 వేల చెక్కును అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేనకు ఎన్‌ఆర్‌ఐ విభాగం మద్దతు అవసరం అని అన్నారు. మీరిచ్చే మద్దతును బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఎక్కడో గల్ఫ్ దేశాలకు వెళ్లి మీరు ప్రశాంతంగా
బతకగలుగుతున్నారని.. ఇక్కడ ఆ పరిస్థితులు లేవని అన్నారు.
"పరాయిదేశం ఎప్పటికైనా పరాయిదేశమే. మన నేల మన గ్రామాల్లో మనం పరాయివాళ్లం కాకూడదు. నా మటుకు నాకు ఒక రాజకీయ పార్టీ తాలూకు లక్ష్యం రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని కాపాడుకోవడమే. ఇక్కడ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే ప్రతి ఒక్కరు దోచేస్తారు. మన దేశంలో స్వేచ్చ ఉంటుంది. అది కోల్పోకూడదు. నా నేల కోసం నేను చేయాలనుకున్నది అదే. ఆ లక్ష్యంతోనే పదేళ్ల పాటు పార్టీని నిర్మించుకున్నా.
ఒక బాధ్యతతో.. చాలా ఇష్టంతో ఇక్కడికి వచ్చా. ఇల్లు, బాధ్యతలు, అక్కడ ఏర్పరుచుకున్న అత్యున్నత జీవితాన్ని వదులుకుని ఇక్కడికి వచ్చా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం అంతా హైదరాబాద్ వలసలు పోతుంటే ఉపయోగం ఏముంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరం. అవినీతిరహిత రాజకీయాలు నా లక్ష్యం. రాజకీయాల్లో నుంచి ఉన్న పళంగా కరప్షన్‌ని పారదోలి అద్భుతాలు చేస్తానని చెప్పను. అవినీతి రహిత రాజకీయాలు అనే అంశాన్ని ఓ నిరంతర ప్రక్రియగా ముందుకు తీసుకువెళ్తాం. రూల్ ఆఫ్ లా అందరికీ సమంగా ఉంటేనే అభివృద్ధి బలంగా ఉంటుంది. దాన్ని నేను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లా.." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read: How To Control Someone: ఇతరులను ఎలా కంట్రోల్ చేయాలి..? ఈ చాణక్య వ్యూహాలు పాటించండి
Also Read: Chandramukhi 2: అప్పుడే చంద్రముఖి-2 రిలీజ్.. కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి