Tirumala Tirupati Devasthanam TTD announced Tirumala online darshan tickets dates: నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ (TTD) తెలిపింది. సర్వదర్శనం టికెట్లు 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. నవంబరుకు (November) సంబంధించి ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల (sarva darshan tickets) విడుదల తేదీలను టీటీడీ (TTD) ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను (sarva darshan tickets) విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Also Read : TDP Leader Pattabhi Arrested : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు
ఇక తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఒకవైపు పౌర్ణమి కావడంతో కలియుగ వైకుంఠానికి భక్తులు పోటెత్తారు. దాదాపు మూడు గంటల పాటు ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదంగా మారిపోయింది. ఊహించిన సగటు వర్ష పాతం కంటే ఎక్కువగానే వర్షం కురవడం వల్ల తిరుమలకు నీటి కొరత తీరిపోయింది. భక్తుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. దీంతో టీటీడీ (TTD) అధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనంపై శ్రీవారు విహరించడంతో కనులారా ఆ స్వామి వైభవాన్ని తిలకించారు భక్తులు.
Also Read : Covid-19 vaccine second dose due: ఆ 10 కోట్ల మంది సెకండ్ డోస్ తీసుకోలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి