Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యామ్ ఖాళీ.. కొనసాగుతున్న మరమ్మతులు..

Tungabhadra Dam Gates: కృష్ణానది  పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ గేట్స్ కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వెంటనే మరమ్మత్తు పనులు చేపడుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 12, 2024, 09:22 AM IST
Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యామ్ ఖాళీ.. కొనసాగుతున్న మరమ్మతులు..

Tungabhadra Dam Gates: తుంగభద్ర డ్యామ్ కు  భారీ వరద కారణంగా ఆ డ్యాం గేటు కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే ప్రభుత్వ యంత్రాగం వెంటనే రంగంలోకి దిగి  తాత్కాలిక గేటు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం హొసహళ్లిలోని హిందుస్థాన్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థ ప్రాథమికంగా పనులు మొదలుపెట్టింది. ఈ పనులను మరో  రెండురోజుల్లో  పూర్తి చేయనున్నట్టు సమాచారం.  19వ క్రస్ట్‌ గేటు నుంచి నీరు బయటకు వెళ్లకుండా అడ్డుకునేలా గేటు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం దీన్ని అమర్చి, నీటి నిల్వలు తగ్గాక పూర్తిస్థాయిలో పనిచేసే గేటు ఏర్పాటు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ సీజన్‌లో రాయలసీమ జిల్లాల్లో  వర్షాలు పడలేదు.  ఈ తరుణంలో తుంగభద్ర డ్యాం నిండింది.  పంటలు పండుతాయనుకున్న సమయంలో  డ్యాం గేటు కొట్టుకు పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నిండు కుండలా తొణికిసలాడుతోంది. దీని నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా.. క్రస్ట్‌ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చేయాలంటే డ్యాంను క్రస్టు స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 61 టీఎంసీల నీరు దిగువకు ఒదిలేయాల్సిందే. ఇప్పటికే  శ్రీశైలం, నాగార్జునసాగర్,పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుగా ఉన్నాయి. దీంతో తుంగభద్ర డ్యామ్ నుంచి ఒదిలే నీటిని  నిల్వ చేసుకునే అవకాశాలు లేదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో సముద్రంలోకి వదలుతున్నారు.

తాత్కాలిక గేటు అమర్చేందుకు కర్ణాటక రాష్ట్రం హొసహళ్లిలోని హిందుస్థాన్‌ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ సంస్థ ప్రాథమికంగా పనులు ప్రారంభించింది. హమీద్‌ గ్రూప్‌ వీరికి సహకరిస్తోంది. మంగళవారం నాటికి పూర్తిచేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. 19వ క్రస్ట్‌ గేటు నుంచి నీరు బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ గేటు ఉపకరిస్తుంది. ప్రస్తుతం దీన్ని అమర్చి, నీటి నిల్వలు తగ్గాక పూర్తిస్థాయిలో పనిచేసే గేటు ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ధ్రువీకరించారు. మరోవైపు ఈ ఆనకట్ట వద్దకు పర్యాటకులు రాకుండా నిషేధం విధించారు.

ఈ సీజన్‌లో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవలేదు. దీంతో వర్షాధారిత ఆయకట్టు వెలవెలబోతుంది. ఇంతలో ప్రాజెక్టులు నిండాయి. కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని అన్నదాతలు ఆశపడ్డారు. ఈ తరుణంలో డ్యాం నిర్వహణలో ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా విపత్తు ముంచుకు రావడంతో రైతలు నిరాశలో కూరుకుపోయారు. నిండుగా ఉన్న తుంగభద్ర డ్యాంలో తలుపు కొట్టుకుపోవటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్లముందే విలువైన జలాలు వృథాగా పోతోంటే.. అన్నదాతల గుండెలు చెరువులవుతున్నాయి. ‘ఈసారి ఆయకట్టుకు పండగొచ్చింది. తుంగభద్రమ్మ మా పొలాల్ని తడిపి ధాన్యపు సిరులు పండిస్తుందనే వారంతా మురిసిపోయారు. నెల ముందే నిండిన జలాశయాన్ని చూసి వాయనాలు సమర్పించారు. పూజలూ చేశారు. అంతే ఉత్సాహంతో నారు పోసి, నీరు పెట్టారు. వడివడిగా నాట్లూ వేస్తున్నారు. తీరా ఇప్పుడు గేటు కొట్టుకుపోయిన పరిణామం కర్ణాటకాతో పాటు ఆంధ్ర రైతులు,  తాగునీటి అవసరాలున్న ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. ఈ సీజన్‌లో జులై నెలాఖరుకే తుంగభద్రకు వరద రావడంతో జలాశయం పూర్తిగా నిండింది.ప్రస్తుతం మళ్లీ పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చి, తుంగభద్రా డ్యాం నిండుతుందా అన్న చర్చ సాగుతోంది. క్రస్ట్‌ గేటు సమస్య రాకుండా ఉంటే జలాశయంలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసేవారు.

ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News