జగన్‌కి మద్దతిస్తే నాకేం ప్రయోజనం లేదు, కేసులు నాకు కొత్త కాదు: వల్లభనేని వంశీ

తాను వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడానికి కారణం ఏంటో వివరించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Updated: Nov 14, 2019, 09:30 PM IST
జగన్‌కి మద్దతిస్తే నాకేం ప్రయోజనం లేదు, కేసులు నాకు కొత్త కాదు: వల్లభనేని వంశీ

విజయవాడ: తనపై కేసులు ఉన్నాయనో లేక ఏదైనా ఆర్థిక ప్రయోజనాల కోసమో తాను వైఎస్సార్సీపీకి మద్దతు పలకడం లేదని.. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం కావడంతోపాటు మంచి పనులు చేస్తుందని భావించాను కనుకే వైసీపీ సర్కార్‌తో కలిసి పని చేయాలని భావిస్తున్నానని వల్లభనేని వంశీ చెప్పారు. ఆ మాటకొస్తే.. తనకు ఇవాళ కేసులు కొత్తేం కాదని.. తాను టీడీపీలో ఉన్నప్పుడే తనపైపై కేసులు పెట్టారని అన్నారు. కేసులకు భయపడే మనిషిని కాను అని వంశీ తేల్చిచెప్పారు. 

పేదలకు, నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడం కోసం ఏదైనా చేస్తానని, అందులో భాగంగానే వైసిపితో కలిసి పనిచేయాలని భావిస్తున్నానని ప్రకటించిన వంశీ.. తాను వైసిపితో కలిసి నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికి టీడీపీ ఎమ్మెల్యేగా తన పదవి అడ్డు వస్తుందనుకుంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా తాను సిద్ధమేనని స్పష్టంచేశారు.