7th Pay Commission: న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా డీఏ ప్రకటన.. ఎంత పెరగనుందంటే..?

DA Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ డబుల్ కానున్నాయి. డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పెంపు ఎంత ఉండనుంది..? జీతం పెరిగితే ఎప్పుడు ఖాతాలో జమ అవుతుంది..? ఇవిగో పూర్తి వివరాలు..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2022, 02:17 PM IST
  • కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త
  • జనవరిలో నెలలోనే డీఏ పెంపు
  • మరోసారి నాలుగు శాతం పెరిగే అవకాశం
7th Pay Commission: న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా డీఏ ప్రకటన.. ఎంత పెరగనుందంటే..?

DA Latest Update: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్ రాబోతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈసారి కూడా జనవరిలో ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రతి సంవత్సరం రెండుసార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. అందులో మొదటిది జనవరిలో.. రెండోది జూలైలో పెంచుతోంది. జూలై నాటి డీఏ ఈ ఏడాది సెప్టెంబర్‌ పెరిగింది. జనవరి 2023లో ప్రకటించే డీఏ.. మార్చి 2023 నుంచి అమలు జరుగుతుందని భావిస్తున్నారు.  

డీఏతోపాటు పింఛనుదారుల డీఆర్‌ కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జనవరి 1 నుంచి వర్తించే ఈ డియర్‌నెస్ అలవెన్స్‌ను బకాయిలు ఉన్న ఉద్యోగులకు మార్చిలో అందజేయనున్నారు. ప్రభుత్వం దీంతో పాటు పెన్షనర్ల డీఆర్‌ను కూడా పెంచుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా 18 నెలల డీఏ బకాయిలు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

డీఏ, డీఆర్ ఏడాదికి రెండుసార్లు పెరుగుతుంది. చివరిసారి సెప్టెంబర్‌లో 48 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం 38 శాతంగా ఉంది. ఇప్పుడు జనవరిలో 4 శాతం పెరుగుదలతో 42 శాతంగా అంచనా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చిలో ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచింది. Aicpi ఇండెక్స్‌లో నిరంతర పెరుగుదల కారణంగా 4 శాతం డీఏ పెంపునకు మార్గం సుగుమం అయింది. అక్టోబర్ 2022లో ఇది 132.5 శాతానికి పెరిగింది. నవంబర్, డిసెంబర్‌ల Aicpi ఇండెక్స్ గణాంకాల ఆధారంగా మార్చిలో డీఏ పెరుగుదల ఉంటుంది.

మరోవైపు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెండింగ్ డీఏపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కరోనా సమయంలో నిలిపేసిన 18 నెలల డీఏ బకాయిల కోసం ఉద్యోగులు పోరాడుతున్నారు. పెండింగ్‌లో డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల ఖాతాల్లో రూ.2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు

Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News