Amazon Great Republic Day Sale: మరో నాలుగు రోజుల్లో ప్రారంభం, 40-75 శాతం డిస్కౌంట్లు

Amazon Great Republic Day Sale: ఓ వైపు సంక్రాంతి పండుగ, మరోవైపు రిపబ్లిక్ డే. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అమెజాన్ నుంచి ఇదే తొలి సేల్ ఆఫర్ కావడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2023, 06:12 AM IST
Amazon Great Republic Day Sale: మరో నాలుగు రోజుల్లో ప్రారంభం, 40-75 శాతం డిస్కౌంట్లు

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా వివిధ రకాల ఉత్పత్తులైన స్మార్ట్‌‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, హోమ్ అప్లయన్సెస్, ఎప్పారెల్ వంటి వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకూ నడుస్తుంది. కొత్త ఏడాదిలో కొత్తగా ఏదైనా కొనే ఆలోచన ఉంటే ఐదు రోజుల రిపబ్లిక్ డే సేల్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 జనవరి 17 నుంచి జనవరి 20 వరకూ ఉంటుంది. అంటే జనవరి 16 రాత్రి నుంచే ప్రారంభమౌతుంది, ప్రైమ్ సభ్యులకు యధావిధిగా జనవరి 16 నుంచి అంటే జనవరి 15 రాత్రి నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో అమెజాన్ ఎస్బీఐతో భాగస్వామ్యం కారణంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు పర్చేజ్‌తో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కలిగి అదనపు ప్రయోజనాల్ని పొందేందుకు కార్డు సిద్ధం చేసుకోండి.

స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, షియోమి వంటి ఉత్పత్తులు 40 శాతం డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఐఫోన్ 13 బెస్ట్ సెల్లింగ్ ఆప్షన్ కానుంది. వన్‌ప్లస్ 10టి, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ, ఐక్యూ నియో6, రెడ్‌మి నోట్ 11 వంటి ఉత్పత్తులపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 

ఇక ల్యాప్‌టాప్స్‌పై కూడా 40 శాతం వరకూ ఆఫర్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌వాచెస్‌పై అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది కంపెనీ. స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. ఇక బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ , నెక్‌బ్యాండ్స్‌లపై కూడా 65-75 శాతం వరకూ డిస్కౌంట్ ఉంది. 

Also read: Best Mileage Bike: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ! ఈ బజాజ్ స్టైలిష్ బైక్ ధర 75 వేలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News